- Telugu News Photo Gallery Foods for Hemoglobin Deficiency: These 7 Foods Will Help You To Increase Hemoglobin Levels in Body
Foods for Anemia: రక్తహీనతతో బాధపడుతున్నారా? వీటిని ఆహారంలో తీసుకుంటే మందులతో పనేలేదు..
హిమోగ్లోబిన్ రక్తంలోని ఒక రకమైన ప్రోటీన్. ఎర్ర రక్త కణాలలో హిమోగ్లోబిన్ ఉంటుంది. ఇది రక్తం ఊపిరితిత్తుల నుండి శరీరంలోని వివిధ భాగాలకు ఆక్సిజన్‌ను తీసుకువెళుతుంది. శరీర భాగాలకు ఆక్సిజన్‌ను చేరవేయడంతో హిమోగ్లోబిన్ ముఖ్యపాత్ర పోషిస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ పరిమాణం తగ్గడాన్ని రక్తహీనత (అనీమియా) అంటారు. ఇలాంటప్పుడు శరీరం బలహీనంగా మారుతుంది. దీనితోపాటు పలు సమస్యలు తలెత్తుతాయి..
Updated on: Jun 16, 2024 | 12:46 PM

హిమోగ్లోబిన్ రక్తంలోని ఒక రకమైన ప్రోటీన్. ఎర్ర రక్త కణాలలో హిమోగ్లోబిన్ ఉంటుంది. ఇది రక్తం ఊపిరితిత్తుల నుండి శరీరంలోని వివిధ భాగాలకు ఆక్సిజన్‌ను తీసుకువెళుతుంది. శరీర భాగాలకు ఆక్సిజన్‌ను చేరవేయడంతో హిమోగ్లోబిన్ ముఖ్యపాత్ర పోషిస్తుంది.

రక్తంలో హిమోగ్లోబిన్ పరిమాణం తగ్గడాన్ని రక్తహీనత (అనీమియా) అంటారు. ఇలాంటప్పుడు శరీరం బలహీనంగా మారుతుంది. దీనితోపాటు పలు సమస్యలు తలెత్తుతాయి. హిమోగ్లోబిన్ మొత్తం పూర్తిగా తగ్గితే రక్తం దాతల నుంచి స్వీకరించవల్సి ఉంటుంది. మందులు కూడా తీసుకోవాలి. కానీ సమస్య తొలినాళ్లలో కేవలం ఆహారం తినడం ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చు.

రక్తహీనత సమస్యలో పి ప్రోటీన్ షేక్ చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ప్రతిరోజూ 20 గ్రాముల ఈ ప్రోటీన్ షేక్ తీసుకోవడం ప్రయోజనం చేకూరుస్తుంది. అలాగే రక్తహీనత ఉన్నవారికి పుదీనా ఆకుల రసం చాలా మేలు చేస్తుంది. ఈ ఆకుల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. బీట్‌రూట్ రసం రక్తహీనతలో కూడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇందులో ఐరన్, పొటాషియం, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి.

ఆల్‌బుకారా జ్యూస్‌లో కూడా ఐరప్ పుష్కలంగా ఉంటుంది. రోజువారీ ఆహారంలో ఆల్‌బుకారా జ్యూస్ తీసుకుంటే రక్తహీనత నుంచి వేగంగా కోలుకోవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను కూడా ఇది అదుపులో ఉంచుతుంది.

బాదంలో ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇందులో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. ఈ గింజలు రక్తంలో హిమోగ్లోబిన్ మొత్తాన్ని పెంచడంలో సహాయపడతాయి. అలాగే రక్తహీనతతో బాధపడేవారు బ్రోకలీని తప్పకుండా తినాలి. ఐరన్, విటమిన్ సి పుష్కలంగా ఉండే ఈ కూరగాయ ఐరన్‌ను గ్రహించడంలో సహాయపడుతుంది.




