Kannappa: కన్నప్ప పైనే మంచు వారి ఆశలు అన్ని.. మంచు విష్ణు టార్గెట్ రీచ్ అయ్యారా.?
డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ప్రమోషన్ స్టార్ట్ చేశారు మంచు విష్ణు. ఆల్రెడీ కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శించిన టీజర్‌ను ఇప్పుడు అన్ని భాషల్లో రిలీజ్ చేశారు. ఈ రోజు ఆడియన్స్ ముందుకు వచ్చిన కన్నప్ప టీజర్ ఎలా ఉంది..? మంచు విష్ణు అనుకున్నది సాధించారా..? మైథలాజికల్ కథను వెండితెర మీద ఆవిష్కరించటం అంటే సాహసం అనే చెప్పాలి. ఆ రిస్క్ చేసేందుకు రెడీ అయిన విష్ణు, మహా శివ భక్తుడు కన్నప్ప కథను వెండితెర మీద ఆవిష్కరించబోతున్నారు.