- Telugu News Photo Gallery Cinema photos Nirmala Convent Movie Heroine Shriya Sharma Latest Photos Goes Viral
Shriya Sharma: అయ్యా బాబోయ్.. నిర్మలా కాన్వెంట్ బ్యూటీ ఏంటీ ఇలా మారిపోయింది..? బొద్దుగా మారిన అందాల రాశి..
శ్రియ శర్మ.. ఈ పేరు ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు అంతగా గుర్తులేదు. కానీ మెగాస్టార్ చిరంజీవి నటించిన జై చిరంజీవ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. తెలుగులో అనేక సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించింది శ్రియ శర్మ. నువ్వు నేను ప్రేమ సినిమాలో సూర్య, జ్యోతిక కూతురిగానూ కనిపించింది.
Updated on: Jun 15, 2024 | 8:02 PM

శ్రియ శర్మ.. ఈ పేరు ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు అంతగా గుర్తులేదు. కానీ మెగాస్టార్ చిరంజీవి నటించిన జై చిరంజీవ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. తెలుగులో అనేక సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించింది శ్రియ శర్మ. నువ్వు నేను ప్రేమ సినిమాలో సూర్య, జ్యోతిక కూతురిగానూ కనిపించింది.

ఆ తర్వాత పలు సినిమాల్లో బాల నటిగా అలరించిన శ్రియా శర్మ.. నిర్మలా కాన్వెంట్ సినిమాతో కథానాయికగా పరిచయమయ్యింది. శ్రీకాంత్ తనయుడు హీరోగా నటించిన నిర్మల కాన్వెంట్ మూవీలో హీరోయిన్గా కనిపించింది. అక్కినేని నాగార్జున నిర్మించిన ఈ సినిమాకు అప్పట్లో మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఆ తర్వాత గాయకుడు అనే సినిమాలో కథానాయికగా అలరించింది. కానీ సడెన్ గా సినిమాలకు దూరమయ్యింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంది. ప్రస్తుతం శ్రియ శర్మకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

తాజాగా శ్రియా శర్మ న్యూలుక్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. ఒకప్పుడు సనజాజి తీగల ఉన్న శ్రియ శర్మ.. ఇప్పుడు గుర్తుపట్టడానికి వీలులేకుండా బొద్దుగా మారిపోయింది. బాలనటిగా తన నటనతో మెప్పించిన శ్రియ శర్మ.. నేషనల్ అవార్డ్ అందుకుంది.

ప్రస్తుతం లా కంప్లీట్ చేసిన శ్రియ శర్మ ప్రాక్టీస్ చేస్తుంది. సినిమాలకు దూరంగా ఉంటున్న శ్రియా శర్మ.. ప్రస్తుతం లాయర్ వృత్తిపైనే ఎక్కువగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శ్రియా శర్మ లేటేస్ట్ ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి.