- Telugu News Photo Gallery Cinema photos Actress Varalaxmi Sarathkumar invites Tollywood celebrities for her wedding, Shares photos
Varalaxmi Sarathkumar: ‘రారండోయ్ వేడుక చూద్దాం’.. టాలీవుడ్ ప్రముఖులను పెళ్లికి ఆహ్వానించిన వరలక్ష్మి.. ఫొటోస్
ప్రముఖ దక్షిణాది నటి వరలక్ష్మీ శరత్ కుమార్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుంది. నికోలాయ్ సచ్ దేవ్ తో కలిసి ఆమె వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనుంది. జులై 2న థాయ్ ల్యాండ్ వేదికగా వరలక్ష్మి- సచ్ దేవ్ ల వివాహం జరుగుతుందని సమాచారం.
Updated on: Jun 15, 2024 | 7:06 PM

ప్రముఖ దక్షిణాది నటి వరలక్ష్మీ శరత్ కుమార్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుంది. నికోలాయ్ సచ్ దేవ్ తో కలిసి ఆమె వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనుంది. జులై 2న థాయ్ ల్యాండ్ వేదికగా వరలక్ష్మి- సచ్ దేవ్ ల వివాహం జరుగుతుందని సమాచారం.

ముహూర్తం దగ్గర పడడంతో పెళ్లి పనుల్లో బిజీగా మునిగిపోయారు వరలక్ష్మి కుటుంబ సభ్యులు. తమ వివాహ వేడుకకు రావాలంటూ సినీ, రాజకీయ ప్రముఖులందరినీ ఆహ్వానిస్తోందీ అందాల తార.

ఇప్పటికే పలువురు కోలీవుడ్ ప్రముఖులను కలిసి తమ వివాహ ఆహ్వాన పత్రికలు అందజేసింది. వీటికి సంబంధించిన ఫొటోలను కూడా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది.

తాజాగా పలువురు టాలీవుడ్ ప్రముఖులను కలిసింది కాబోయే పెళ్లి కూతురు. తమ వివాహానికి రావాలని ఆహ్వానించింది.

వరలక్ష్మి కలిసిన వారిలో సమంత, నయనతార, రవితేజ, అడవిశేష్, థమన్, ప్రశాంత్ వర్మ, గోపిచంద్ మలినేని, హరీశ్ శంకర్, వంశీ పైడిపల్లి తదితరులు ఉన్నారు.

ప్రస్తుతం వీరు దిగిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. వరలక్ష్మికి ముందస్తు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.