- Telugu News Photo Gallery Cinema photos Other country people waiting for kalki 2898 AD then prabhas become a pan world star Telugu Heroes Photos
Kalki 2898 AD: కల్కి తో పాన్ వరల్డ్ స్టార్ గా మారనున్న ప్రభాస్.. ఇవే వావ్ ఫాక్టర్స్.
ప్రభాస్ రేంజ్ ఇప్పుడు పాన్ ఇండియా కాదు.. గ్లోబల్ అంటున్నారు ఫ్యాన్స్. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న కల్కి 2898 ఏడీ బజ్ చూస్తే అది నిజమే అనిపిస్తోంది. ఇన్నాళ్లు డార్లింగ్‌ను పాన్ ఇండియా సూపర్ స్టార్‌గా చూసిన ఆడియన్స్ కల్కి రిలీజ్ తరువాత ఇంటర్నేషనల్ స్టార్ అనటం పక్కా అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ కల్కి.
Updated on: Jun 15, 2024 | 7:20 PM

ప్రభాస్ రేంజ్ ఇప్పుడు పాన్ ఇండియా కాదు.. గ్లోబల్ అంటున్నారు ఫ్యాన్స్. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న కల్కి 2898 ఏడీ బజ్ చూస్తే అది నిజమే అనిపిస్తోంది.

ప్రమోషన్ ఏదైనా ఆ ఒక్క విషయాన్ని మాత్రం కచ్చితంగా ఫాలో అవుతున్నారు కల్కి 2898ఏడీ మేకర్స్. కల్కి ప్రమోషన్లు షురూ చేసినప్పటి నుంచీ ఈ విషయాన్ని గమనిస్తూనే ఉన్నారు ఫ్యాన్స్.

నియర్ ఫ్యూచర్‌లోనూ ప్రమోషన్లలో ఈ స్ట్రాటజీనే ఫాలో అవుతారా? అంటూ ఇష్టంగా ఆరా తీస్తున్నారు. ఇంతకీ అంతగా కిక్ ఇస్తున్న స్ట్రాటజీ ఏంటి.? ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా కల్కి2898ఏడీ.

నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. రీసెంట్‌గా విడుదలైన ట్రైలర్ సినిమా మీద అంచనాలను అమాంతం పెంచేసింది. అందుకే ప్రతి చిన్న అప్‌డేట్‌నీ నిశితంగా పరిశీలిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్.

ముఖ్యంగా కల్కి 2898 ఏడీ ట్రైలర్ రిలీజ్ తరువాత ఈ సినిమా మీద అంచనాలు పీక్స్‌కు చేరాయి. కేవలం ఇండియాలోనే కాదు, ఓవర్‌సీస్‌లో కూడా డార్లింగ్ మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.

కల్కి ప్రమోషన్లలో టీమ్ ఓ స్పెషల్ థీమ్‌ని ఫాలో అవుతుందని అంటున్నారు. ఇప్పటిదాకా కల్కికి సంబంధించి ప్రభాస్ సోలోగా ఎప్పుడూ కనిపించలేదు. ట్రైలర్ లో టీమ్ అంతా కనిపించింది.

కల్కి సాధించిన హిస్టారికల్ సక్సెస్ తో ప్రభాస్ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ పై మరింత హైప్ క్రియేట్ అవుతోంది. ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజా సాబ్, ప్రశాంత్ నీల్ తో సలార్ 2, సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో స్పిరిట్, హను రాఘవపూడితో ఓ క్రేజీ మూవీ చేస్తున్నారు.




