- Telugu News Photo Gallery Business photos Alert for customers of 7 banks these changes to take place from april 1
ఈ ఏడు బ్యాంకుల్లో మీకు ఖాతా ఉందా..? వెంటనే ఈ పనులు చేసుకోండి.. ఏప్రిల్ నుంచి కొత్త నిబంధనలు.!
Alert for customers: బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. పలు బ్యాంకులకు చెందిన చెక్‌బుక్‌లు, పాస్‌బుక్‌లు ఇక నుంచి పని చేయవు. కారణం బ్యాంకుల విలీనం కావడమే...
Updated on: Mar 12, 2021 | 10:06 AM

బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. పలు బ్యాంకులకు చెందిన చెక్‌బుక్‌లు, పాస్‌బుక్‌లు ఇక నుంచి పని చేయవు. కారణం బ్యాంకుల విలీనం కావడమే. కొన్ని బ్యాంకులు ఇతర బ్యాంకుల్లో విలీనం కావడం ఈ సమస్య వచ్చిపడింది. వీటి ప్రక్రియ మార్చి 31తో ముగుస్తుంది. ఏప్రిల్ నుంచి పాత చెక్‌బుక్స్, పాస్ బుక్స్ పని చేయవు.


విలీనమైపోయిన బ్యాంకుల్లో మీ ఖాతాలు ఉంటే వెంటనే వివరాలను అప్‌డేట్స్ చేసుకోవాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్, చిరునామా, నామినీ పేరు వంటివి విరాలను బ్యాంక్‌కు వెళ్లి అప్‌డేట్ చేసుకోండి. ఇలాంటివి ముందుగానే చేసినట్లయితే భవిష్యత్తులు సమస్యలు తలెత్తకుండా ఉంటుంది.

కొత్త చెక్‌బుక్స్, పాత పాస్‌బుక్స్ తీసుకున్న తర్వాత మీరు మీ వివరాలను ఇతర ఫైనాన్షియల్ ఇన్‌స్ట్రుమెంట్లలో కూడా అప్‌డేట్ చేసుకోవడం తప్పనిసరి. మ్యూచువల్ ఫండ్స్, ట్రేడింగ్ అకౌంట్, లైఫ్ ఇన్సూరెన్స్, ఇన్‌కమ్ ట్యాక్స్ అకౌంట్, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు, పీఎఫ్ తదితర వాటిల్లో బ్యాంక్ అకౌంట్ వివరాలు అప్‌డేట్ చేసుకోండి.




