- Telugu News Photo Gallery Applying these face packs with carrot will give you a clear skin, Check Here is Details
Carrot for Skin Glow: క్యారెట్‌ని ఇలా వాడారంటే ముఖం వెలిగిపోవాల్సిందే..
క్యారెట్ తింటే ఆరోగ్యానికి మంచిదన్న విషయం తెలిసిందే. అయితే క్యారెట్‌తో ఆరోగ్యాన్నే కాకుండా అందాన్ని కూడా పెంచుకోవచ్చు. క్యారెట్‌తో ఎన్నో రకాల ఫేస్ ప్యాక్స్ వేసుకోవచ్చు. ఈ ఫేస్ ప్యాక్స్‌తో మంచి క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ లభిస్తుంది. మరి అవేంటో చూసేయండి..
Updated on: Jan 16, 2025 | 9:35 PM

క్యారెట్ తింటే ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. క్యారెట్ తింటే శరీరం కూడా హెల్దీగా ఉంటుంది. క్యారెట్‌తో అందాన్ని కూడా పెంచుకోవచ్చు. సాధారణంగా క్యారెట్‌తో ఎన్నో రకాల వంటలు తయారు చేసుకుంటూ ఉంటారు. కానీ ఇలా ఫేస్ ప్యాక్స్ వేసుకుంటే చర్మ అందం కూడా పెరుగుతుంది.

క్లియర్ స్కిన్ కోసం క్యారెట్‌ని పేస్టులా చేసి రసం తీసుకోవాలి. ఇందులో కొద్దిగా తేనె, నిమ్మ రసం కలిపి ముఖానికి పట్టిస్తే చర్మంపై ఉండే డెడ్ స్కిన్ సెల్స్ పోయి చర్మం క్లియర్‌గా మారుతుంది. తరచూ వేసుకుంటే మచ్చలు కూడా తగ్గుతాయి.

క్యారెట్, బీట్‌రూట్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియలో సహాయపడుతుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తినడం కడుపు నిండుగా ఉంటుంది. అతిగా తినకుండా ఉంటారు. బరువు తగ్గడానికి ఇది మంచిది. అయితే క్యారెట్, బీట్‌రూట్‌లను జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల ఫైబర్ కంటెంట్ గణనీయంగా తగ్గుతుంది.

నేరుగా క్యారెట్ రసాన్ని కూడా కాటన్ సహాయంతో ముఖానికి అప్లై చేయవచ్చు. ఇలా తరచూ చేసినా కొద్ది రోజులకు మంచి మార్పు వస్తుంది. క్యారెట్ రసం లేదా పేస్టులో అయినా కొద్దిగా పెరుగు కలిపి ముఖానికి పట్టించినా సాఫ్ట్ స్కిన్ మీ సొంతం అవుతుంది.

ఇలా క్యారెట్‌తో చాలా రకాల ఫేస్ ప్యాక్స్ వేసుకోవచ్చు. క్యారెట్ రసం తరచూ తాగినా, రోజుకు ఒక క్యారెట్ తిన్నా చర్మ రంగులో మంచి మార్పులు వస్తుంది. అందాన్ని పెంచడంలో క్యారెట్ ఎంతో హెల్ప్ చేస్తుంది.




