ఉసిరిలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇవి శరీరంలో మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి. ఉసిరిలోని పోషకాలు డయాబెటిక్ పేషెంట్లకు ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా ఉసిరిలోని విటమిన్ సి, ఫైబర్, ఫోలేట్, ఫాస్పరస్, కార్బోహైడ్రేట్లు, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, యాంటీ-ఆక్సిడెంట్లు రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతాయి.