ఆస్తి కోసం దాడి చేసి తల్లినే హతమార్చాడు..
మానవ సంబంధాలు కనుమరుగైపోతున్నాయి. ఆస్తి కోసం కన్న తల్లినే చంపిన నిందితుడిని యూకేలో అరెస్ట్ చేశారు. తల్లి హత్య కేసులో దోషిగా తేలిన 48 ఏళ్ల భారత సంతతి వ్యక్తికి బ్రిటన్ కోర్టు తాజాగా జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. తూర్పు ఇంగ్లండ్‌లోని లీసెస్టర్‌లో ఈ ఘటన జరిగింది. వారు నివాసం ఉంటున్న ఇంట్లోనే 76 ఏళ్ల తల్లిపై దాడి చేసి సదరు వ్యక్తి హత్యకు పాల్పడినట్లు కోర్టు విచారణలో తేలింది.
వివరాల్లోకి వెళితే.. మే 13న అనుమానాస్పదంగా చనిపోయిన భజన్ కౌర్ తల, ముఖంపై తీవ్ర గాయాలు కావడం లీసెస్టర్‌షైర్ పోలీసులు గుర్తించారు. దాంతో ఆమె కుమారుడు సిందీప్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని లీసెస్టర్ క్రౌన్ కోర్టులో హాజరుపరిచారు. 16 రోజుల విచారణ అనంతరం సింగ్ హత్యకు పాల్పడినట్లు కోర్టు తేల్చింది. దాంతో తాజాగా అతనికి జీవిత ఖైదు విధించింది. డిటెక్టివ్ చీఫ్ ఇన్‌స్పెక్టర్ మార్క్ సింస్కీ మాట్లాడుతూ.. ఈ కేసు తీవ్ర కలత సృష్టించిందని తల్లి కౌర్ ని చంపిన తర్వాత సింగ్ ఆమె మృతదేహాన్ని తన ఇంటి తోటలో పూడ్చిపెట్టేందుకు ప్రయత్నించాడని తెలిపారు. దానికోసం బయటకు వెళ్లి పలుగు, ఒక గోనె సంచి కొన్నాడు కానీ అతను ఆ పని చేయలేకపోయాడనీ ఆ తర్వాత ఇంటి నుంచి వాసన రావడంతో కంగారు పడ్డాడనీ అన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అప్పు చేస్తే ఉప్పురాయి కూడా మిగలదు. మైక్రో ఫైనాన్స్ వలలో ఇరుక్కున్నారేమో చూసుకోండి
రాజమండ్రిలో కేవలం రూ.5 కే బిర్యానీ..
నగ్నంగా రైలెక్కిన యువకుడు.. మహిళల కంపార్టుమెంట్‌లోకి వెళ్లి..
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో

