ఎక్కడికక్కడ గడ్డకట్టిన.. సరస్సులు, జలపాతాలు
కశ్మీర్‌ను మంచు దుప్పటి కప్పేసింది. కనుచూపుమేర ఎటు చూసినా.. హిమపాతమే కనిపిస్తోంది. కశ్మీర్ పరిసరాలన్నీ శ్వేతవర్ణంతో మెరిసిపోతూ.. పర్యాటకులను మురిపిస్తున్నాయి. మరోవైపు కశ్మీర్ లోయలో గడ్డ కట్టించేంతగా చలి తీవ్రత పెరిగింది. చాలా ప్రాంతాల్లో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యల్పంగా కార్గిల్‌లో -13.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.
శ్రీనగర్ లో మైనస్ 6 డిగ్రీలుగా ఉంది. సరస్సులు, జలపాతాలు ఎక్కడికక్కడ గడ్డకట్టాయి. ద్రాస్, గుల్మార్గ్, పహల్గా వంటి ప్రాంతాల్లోని కొండలు, లోయలు..మంచు అందాలను సంతరించుకున్నాయి.మైనస్ ఉష్ణోగ్రతలు కాస్త ఇబ్బంది పెడుతున్నప్పటికీ..మంచు అందాలు మాత్రం ఆకట్టుకుంటున్నాయి. హిమపాతంతో..అక్కడి కొండలు, లోయలు భూతల స్వర్గాన్ని తలపిస్తున్నాయి. కశ్మీర్‌లోని బందిపొరా, ద్రాస్, కార్గిల్, సోనామార్గ్, జోజిలా పాస్ ఏరియాల్లో.. ఎడతెరిపిలేకుండా మంచు కురుస్తోంది. దాంతో ప్రకృతి సరికొత్త అందాలతో కనువిందు చేస్తోంది. పర్యాటకుల స్వర్గధామంగా చెప్పే గుల్మార్గ్ అందాల్ని వర్ణించాలంటే మాటలు చాలవు. గట్టకట్టించే చలిలో మంచుతో ఆటలాడుతూ టూరిస్టులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. భూతలస్వర్గం అంటే ఇదేనేమో అంటూ సంబర పడుతున్నారు. కుప్వారాలోని మచిల్ సెక్టార్‌లో మంచు కురవడంతో ఆ ప్రాంతం మరింత అందంగా కనిపిస్తోంది. భారీగా పేరుకున్న హిమపాతం పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తోంది. గురేజ్, తులైల్, కంజల్వాన్ సరిహద్దు ప్రాంతాలతో సహా బందిపోరా ఎగువ ప్రాంతాలలో కూడా తెల్లటి మంచు దుప్పటి అందంగా పరుచుకుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ విగ్గు రాజా.. విగ్గులు మారుస్తూ 50 మంది యువతులుకు మోసం
X వ్యాధి.. కరోనా కంటే 7 రెట్లు డేంజర్
ఫ్యామిలీ అంటే మీదేనయ్యా !! నలుగురికీ గిన్నిస్ రికార్డులు