కాకి బిర్యానీ కోసం 19 కాకులను చంపిన దంపతులు
వెజ్ బిర్యానీ మాత్రమే కాదు చికెన్ బిర్యానీ , ఎగ్ బిర్యానీ, రొయ్యల బిర్యానీ వంటి రకరకాల బిర్యానీలు మాంసాహార ప్రియులు ఇష్టంగా తింటారు. అయితే ఒక జంటకు వింత కోరిక కలిగి నట్లు ఉంది.. కాకుల ను చంపి ఆ మాసంతో ఏకంగా విందుకి రెడీ అవుతున్నారు. కాకి మాంసం అనగానే సునీల్ నటించిన ఓ ఫన్నీ సీన్ గుర్తుకొస్తుంది. ఓ కాకా హోటల్ లో సునీల్ చికెన్ బిర్యానీ తింటాడు.
తర్వాత కాకిలా అరవడం మొదలపెడతాడు. ఆ తర్వాత తాను తిండి కోడి బిర్యానీ కాదని కాకి బిర్యానీ అని తెలిసి షాక్ తింటారు. కాకి మాసంతో విందు మళ్ళీ వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన తమిళనాడులోని , తిరువళ్లూరు జిల్లాలో జరిగింది. తిరువళ్లూరులోని ఓ గ్రామంలో కాకులను చంపి మాసంతో బిర్యానీ చేయడానికి రెడీ అయిన జంటకు అటవీశాఖ హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాదు జరిమానా కూడా విధించింది. తోరైపాక్కం గ్రామంలో రమేష్, భూచమ్మ అనే దంపతులు కాకులను చంపుతున్నట్లు అటవీశాఖ అధికారులకు సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు రమేష్ దంపతుల ఇంట్లో సోదాలు చేసి ఇంట్లో ఉన్న 19 కాకులు స్వాధీనం చేసుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

