ఫ్యామిలీ అంటే మీదేనయ్యా !! నలుగురికీ గిన్నిస్ రికార్డులు
పట్టుదల ఉంటే రికార్డులు దాసోహం అంటాయి అని నిరూపించింది ఆ కుటుంబం. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ అంటే మాటలా.. ఆ బుక్కులోకి ఎక్కాలంటే ఎంతో కృషి, పట్టుదల ఉంటేగానీ ఆశ నెరవేరదు. అలాంటిది ఒకే కుటుంబంలోని నలుగురు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సులో స్థానం సంపాదించారు. చైనాలో నివసిస్తున్న ఓ భారతీయ కుటుంబం ఈ ఘనతను సాధించింది.
భర్తను చూసి భార్య, తల్లిదండ్రులను చూసి పిల్లలు పట్టుబట్టి మరీ సాధించారు. ఏక కాలంలో గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించారు. యోగా-క్రీడలు కేటగిరీలో కొణతాల విజయ్, జ్యోతి దంపతులు గిన్నిస్ రికార్డులు సాధించారు. వారితో పాటు పిల్లలు జస్మిత, శంకర్ కూడా చిన్న వయస్సులోనే గిన్నిస్ రికార్డులు సొంతం చేసుకున్నారు. అష్టవక్రాసనం, మయూరాసనం, బాకాసనం వంటి ఆసనాల భంగిమలో ఎక్కువ సమయం ఉండి రికార్డు సృష్టించాడు కొణాతల విజయ్. ఇక 9 నెలల గర్భవతిగా ఉండి క్లిష్టమైన యోగా భంగిమల్లో ఎక్కువ సమయం ఉండి గిన్నిస్ రికార్డు సొంతం చేసుకుంది విజయ్ సతీమణి జ్యోతి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వైరల్ వీడియోలు
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం

