శునకానికి వర్ధంతి.. జ్ఞాపకాలతో ఫ్లెక్సీ ఏర్పాటు
పద్నాలుగేళ్ల క్రితం డాబర్ మెన్ కుక్క పిల్లను కొని ఓ వ్యక్తి ఇంటికి తెచ్చుకున్నాడు. గత ఏడాది ఇంటి బయట వేగంగా వచ్చిన కారు ఢీ కొనడంతో కుక్క ప్రాణాలు కోల్పోయింది. డిసెంబర్ 17కి ఆ కుక్క చనిపోయి ఏడాది అయిన సందర్భంగా ప్లెక్స్ కూడా వేయించి ఇంటి ముందు పెట్టుకున్నాడు. ప్రస్తుతం దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
గుంటూరు ఫాతిమా పురంకు చెందిన సీతంశెట్టి శ్రీనివాసరావు.. పద్నాలుగేళ్ల క్రితం డాబర్ మెన్ కుక్క పిల్ల జిమ్మీని కొని ఇంటికి తెచ్చుకున్నారు. అప్పటి నుండి దాన్ని అపురూపంగా పెంచుకున్నారు. దానికి జిమ్మి అని పేరు కూడా పెట్టుకున్నారు. కొన్నేళ్ల తర్వాత జిమ్మికి క్యాన్సర్ సోకింది. మంచి వైద్యం చేయించడంతో క్యాన్సర్ వ్యాధి నుండి బయటపడింది. కాని కొద్ది కాలానికే ఇంటి బయట వేగంగా వచ్చిన కారు ఢీ కొనడంతో జిమ్మి ప్రాణాలు కోల్పోయింది. జిమ్మి లేని బాధను మర్చిపోవటానికి మరో కుక్క పిల్లను తెచ్చుకొని శ్రీనివాసరావు పెంచుకుంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అలా వస్తారు.. ఇలా తెంపుకుపోతారు.. మహిళల్లో భయం.. భయం
ఏపీలో చొరబడ్డ జికా వైరస్.. అంతటా టెన్షన్.. టెన్షన్..
చింత చెట్టుకు కల్లు !! బ్రహ్మం గారు చెప్పిన వింతే అంటున్న జనం
వైరల్ వీడియోలు
Latest Videos