చింత చెట్టుకు కల్లు !! బ్రహ్మం గారు చెప్పిన వింతే అంటున్న జనం
కొన్ని సంఘటనలు చూస్తే నిజంగా ఆశ్చర్యం కలగకమానదు. కళ్లముందే వింత వింత సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అలాంటి సంఘటనే అక్కడి స్థానికులను విస్తుపోయేలా చేసింది. వివరాల్లోకి వెళితే.. తాటి చెట్లు.. ఈత చెట్లకు కల్లు రావడం సహజం.. అక్కడక్కడా వేప చెట్లకు కళ్ళు వచ్చిన సంఘటనలు కూడా చూసాం.. కేరళ వంటి రాష్ట్రాల్లో కొబ్బరి కల్లును కూడా తీస్తారు.
ఇంకా కొన్ని చోట్ల జీలుగ కల్లును కూడా చూస్తుంటాం. కానీ అదేమి విచిత్రమో గానీ చింతచెట్టుకు కల్లు రావడం జనాన్ని ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది.. ఆ కళ్లు తాగి లొట్టలేస్తున్న జనం అంతా బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం లీలే అంటున్నారు.. ఈ విచిత్ర సంఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం వేలుబేల్లి గ్రామంలో జరిగింది.. పోచమ్మ దేవాలయం పక్కనే ఉన్న చింత చెట్టుకు కల్లు వస్తోంది.. తాటి చెట్లు, ఈత చెట్టు నుండి ఎలా కల్లు వస్తుందో అదే తరహాలో చింత చెట్టు నుండి కల్లు ఉబికి వస్తుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టోల్ మోత.. తిరిగిన ప్రతీసారీ ఎంత కట్టాలో తెలుసా ??
ప్రతి ఇంటి ముందు ఓ కొండముచ్చు ఫ్లెక్సీ.. ఎందుకలా ??
ఏంటి మమ్మి ఇలా ఉన్నారు.. వాట్సాప్ ద్వారా బ్యాంకు మేనేజర్‌నే ముంచేశాడు..
వైరల్ వీడియోలు
Latest Videos