టీ కప్పు గాడిద పాల రేటు ఎంతో తెలిస్తే మతిపోవడం ఖాయం !!
ఆంధ్రప్రదేశఃలో గాడిద పాలకు డిమాండ్ పెరిగింది. గాడిద పాలతో అందం, ఆరోగ్యం రెండు వస్తాయని ప్రజల నమ్ముతున్నారు. శీతాకాలంలో వచ్చే వైరసులను నిరోధించడానికి గాడిద పాలు శ్రేయస్కరం అని వైద్యులు చెబుతుండడంతో పెద్ద ఎత్తున గాడిద పాలను సేవించే వారి సంఖ్య పెరిగింది. చాలా కాలంగా గాడిదలను పెంచుతున్న వారు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా డిమాండ్ ఉన్న పలు పట్టణాల్లోకి గాడిదలతో సహా వచ్చి అప్పటికప్పుడు అక్కడే పాలను పిండి ఇస్తున్నారు.
ముఖ్యంగా గాడిద పాలు సేవిస్తే ఎటువంటి అనారోగ్యాలు దరిచేరవని ముఖ్యంగా శీతాకాలంలో ఊపిరితిత్తుల్లో నిమ్ము, ఆయాసం, కఫం, జలుబు, దగ్గు లాంటివి నిరోధించడానికి గాడిద పాలు ఔషధంగా పనిచేస్తాయని ప్రజల్లో బలంగా నమ్మకం ఉంది. దీంతో చలికాలం వచ్చినా.. నాలుగు నెలల పాటు విపరీతమైన డిమాండ్ గాడిద పాలకు నెలకొంది. గాడిద పాల ధర సైతం ఎక్కువే.. ఒక చిన్న టీ కప్పు సైజులో ఉండే గాడిద పాలు ధర ₹100. ఈ లెక్కన లీటర్ గాడిద పాలు కొనాలంటే ₹7000 వరకు ఖర్చవుతుంది. గాడిదను పెంచడానికి పోషించడానికి ఎక్కువ మొత్తంలో ఖర్చవడంతోనే గాడిద పాల ధర కూడా అధికంగా ఉంటుందని చెప్తున్నారు. ఒక్కో గాడిద రోజుకు అర లీటర్ నుంచి లీటర్ వరకు మాత్రమే పాలిస్తుంది. గాడిద పాలలో విటమిన్లు పుష్కలంగా ఉండటంతో ప్రజలు వాటిని ఎక్కువగా సేవిస్తున్నారని అందుకే డిమాండ్ ఉందని వ్యాపారులు అంటున్నారు. గాడిద పాలలో A విటమిన్, బి1, బి5, బి6, పాటు ఫోలిక్ ఆమ్లం ఉండటంతోనే వాటిని కొనుగోలు చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తిని చూపిస్తున్నారని చెబుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Rashmika: లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్.. మీకు అర్థమవుతోందా ??
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
మర్రిచెట్టు తొర్రలో.. రూ.15 లక్షలు!
ఈ బుడ్డోడి లక్కే లక్కు.. రూ.200 తో రూ. 50 లక్షల కారు పట్టేసాడు
మహిళా డ్రైవర్ క్యాబ్‌లో ప్రయాణం.. యువతి కామెంట్ వైరల్!
అదృష్టం అంటే ఇతనిదే.. భూమిలో దొరికిన బంగారు నిధి!
వెయిటర్‌పై చేయి చేసుకున్న గెస్ట్.. కట్ చేస్తే
సందర్మాట్ కెనాల్ ఒడ్డున అరుదైన శ్వేతనాగు దర్శనం!

