సైనికుల ముఖాలను గుర్తుపట్టకుండా కాల్చేస్తున్న పుతిన్ సేనలు
ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తూ మృతి చెందిన ఉత్తరకొరియా సైనికుల ముఖాలను గుర్తుపట్టకుండా పుతిన్ సేనలు కాల్చేస్తున్నాయని జెలెన్‌స్కీ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. కుర్స్క్ రీజన్‌లో పాతిపెట్టడానికి ముందు పుతిన్ సేనలు ఈ దుశ్చర్యకు పాల్పడుతున్నాయంటూ వ్యాఖ్యలు చేశారు. ఆ ఫొటోలలో యుద్ధంలో చనిపోయిన కొరియా సైనికులను కాల్చినట్లు కనిపించింది.
ఉక్రెయిన్-రష్యా మధ్య జరుగుతోన్న యుద్దంలో మాస్కోకు మద్దతుగా ఉత్తర కొరియా తన బలగాలను పంపింది. ఉక్రెయిన్ సరిహద్దుల్లోని కుర్క్స్ ప్రాంతంలో కిమ్ బలగాలను మోహరించారు. ఉక్రెయిన్- రష్యా సంఘర్షణలో ఉత్తర కొరియా జోక్యం చేసుకోవడంపై అంతర్జాతీయ సమాజం తీవ్ర ఆందోళనకు గురయ్యింది. దీని వల్ల పరిస్థితి మరింత తీవ్రమవుతుందని అభిప్రాయపడింది. ఈ క్రమంలో రష్యా కోసం పోరాటం చేస్తోన్న ఉత్తర కొరియా సైనికులు రెండు రోజుల్లో 30 మంది చనిపోయినట్లు ఉక్రెయిన్ తెలిపింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టీ కప్పు గాడిద పాల రేటు ఎంతో తెలిస్తే మతిపోవడం ఖాయం !!
Rashmika: లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్.. మీకు అర్థమవుతోందా ??
వైరల్ వీడియోలు
Latest Videos