ట్యాక్స్‌లపై భారత్‌కు వార్నింగ్ ఇచ్చిన ట్రంప్
అమెరికా అధ్యక్ష బాధ్యతలు రెండోసారి చేపట్టేందుకు రెడీ అవుతున్న డొనాల్డ్ ట్రంప్ ఇండియాకు వార్నింగ్ ఇచ్చాడు. పన్నుల అంశంలో భారత విధానాన్ని తప్పుపట్టారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ భారీగా పన్నులు వేస్తుందని, దానికి ప్రతీకారంగా మేం కూడా ట్యాక్స్‌ను వసూల్ చేయనున్నట్లు ట్రంప్ తెలిపారు. ఇది ప్రతిచర్యగా ఉంటుందని అన్నారు.
అమెరికా ఉత్పత్తులపై భారత్, బ్రెజిల్ వంటి దేశాలు అత్యధిక పన్నులు విధిస్తున్నాయి. 100, 200శాతం పన్నులు వేస్తున్నాయి. దేనికైనా ప్రతిచర్య ఉంటుంది. వాళ్లు మాపై పన్నులు విధిస్తే మేమూ అంతేస్థాయిలో పన్నులు వసూలు చేస్తాం. ఒకవేళ భారత్ 100శాతం పన్నులు విధిస్తే మేము వారిపై అలాగే ఛార్జ్ చేయకూడదా? ఆయా దేశాలు సుంకాలు వసూలుచేయడం అనేది వారి ఇష్టమే. కానీ, మేం కూడా అలాగే స్పందిస్తాం అని ట్రంప్ వివరించారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలపై అత్యధిక సుంకాలు విధిస్తానని గతంలోనూ హెచ్చరించారు. తాజా వ్యాఖ్యలతో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత దీనిపై ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అలా వస్తారు.. ఇలా తెంపుకుపోతారు.. మహిళల్లో భయం.. భయం
ఏపీలో చొరబడ్డ జికా వైరస్.. అంతటా టెన్షన్.. టెన్షన్..
చింత చెట్టుకు కల్లు !! బ్రహ్మం గారు చెప్పిన వింతే అంటున్న జనం
టోల్ మోత.. తిరిగిన ప్రతీసారీ ఎంత కట్టాలో తెలుసా ??
ప్రతి ఇంటి ముందు ఓ కొండముచ్చు ఫ్లెక్సీ.. ఎందుకలా ??