టోల్ మోత.. తిరిగిన ప్రతీసారీ ఎంత కట్టాలో తెలుసా ??
గుంటూరు-విజయవాడ జాతీయ రహదారిలో ఉన్న టోల్‌గేట్ లో కొత్త నిబంధన వచ్చింది. ఇప్పటివరకు ఒకేసారి టోల్ చెల్లిస్తే... 24 గంటలు పాటు తిరిగే అవకాశం ఉంది. ఇకనుంచి కొత్త నిబంధనతో మొదటిసారి వెళితే 160 రూపాయలు... ఆ తర్వాత రోజుకు ఎన్నిసార్లు తిరిగినా ప్రతిసారి 80 రూపాయలు చెల్లించాలనే నిబంధన తీసుకొచ్చారు.
ఒకరోజులో ఎన్నిసార్లు రాకపోకలు సాగిస్తే, అన్నిసార్లూ టోల్ మోత మోగునుందన్నమాట. రాష్ట్రంలోని 65 టోల్ ప్లాజాల్లో ఇదే పరిస్థితి. వీటి బీవోటీ గడువు ముగియడంతో అక్టోబరు నుంచి కొత్త నిబంధన ప్రకారం టోల్ వసూళ్లు జరుగుతున్నాయి. సెప్టెంబరు వరకు ఒకసారి వెళితే కారుకు రూ. 160, తిరుగు ప్రయాణంలో రూ. 80 చెల్లిస్తే సరిపోయేది. 24 గంటల వ్యవధిలో మళ్లీ ఎన్నిసార్లు తిరిగినా టోల్ వసూళ్లు ఉండేవి కావు. కానీ అక్టోబరు నుంచి అమలులోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వ కొత్త నిబంధనల ప్రకారం ఎన్నిసార్లు తిరిగితే అన్నిసార్లూ ఒకవైపు పూర్తి ఫీజు, రెండోసారి సగం ఫీజు చొప్పున.. వసూలు చేస్తున్నారు. విజయవాడ-గుంటూరు మధ్య నిత్యం వందలమంది వాహనాల్లో రాకపోకలు సాగిస్తుంటారు. వారిపై టోల్ రూపంలో తీవ్ర భారం పడుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రతి ఇంటి ముందు ఓ కొండముచ్చు ఫ్లెక్సీ.. ఎందుకలా ??
ఏంటి మమ్మి ఇలా ఉన్నారు.. వాట్సాప్ ద్వారా బ్యాంకు మేనేజర్‌నే ముంచేశాడు..
సైనికుల ముఖాలను గుర్తుపట్టకుండా కాల్చేస్తున్న పుతిన్ సేనలు
టీ కప్పు గాడిద పాల రేటు ఎంతో తెలిస్తే మతిపోవడం ఖాయం !!
Rashmika: లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్.. మీకు అర్థమవుతోందా ??