నగ్నంగా రైలెక్కిన యువకుడు.. మహిళల కంపార్టుమెంట్‌లోకి వెళ్లి..
ముంబయిలోని ఓ లోకల్ రైలులో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ నుంచి కళ్యాణ్ కు బయలుదేరిన లోకల్ రైలులో జరిగిన హఠాత్‌పరిణామానికి మహిళలు జడుసుకున్నారు. రైలు ఘట్‌కోపర్ స్టేషన్‌లో ఆగగానే ఓ యువకుడు ఒంటిపై నూలుపోగు లేకుండా రైలెక్కాడు. నేరుగా మహిళల కంపార్టుమెంట్‌లోకే అతడు ప్రవేశించాడు.
దాంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అతడిని రైల్లోంచి దిగిపోవాలంటూ మహిళలంతా కేకలు వేశారు. అయినా అతడు వినిపించుకోలేదు. రైల్లోంచి దిగేందుకు నిరాకరించాడు. దాంతో రైలు ఆపాలని మహిళలంతా గట్టిగా అరిచారు. మహిళల అరుపులు విని పక్క బోగీలో ఉన్న టీసీ అక్కడికి చేరుకున్నాడు. నగ్నంగా ఉన్న యువకుడిని కిందకు దిగమని హెచ్చరించాడు. అయినా అతడు నిరాకరించడంతో టీసీ అతడిని పక్క స్టేషన్‌లో బలవంతంగా కిందకు తోశాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎక్కడికక్కడ గడ్డకట్టిన.. సరస్సులు, జలపాతాలు
ఈ విగ్గు రాజా.. విగ్గులు మారుస్తూ 50 మంది యువతులుకు మోసం
X వ్యాధి.. కరోనా కంటే 7 రెట్లు డేంజర్
వైరల్ వీడియోలు
Latest Videos