రాజమండ్రిలో కేవలం రూ.5 కే బిర్యానీ..
ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న క్యూ లైన్లు ఏ దైవ దర్శనానికో... లేదంటే ఏ తిరనాళ్లకో కాదు. వీళ్లంతా కేవలం ఐదు రూపాయలకే బిర్యానీ అని ఓ రెస్టారెంట్ ఓనర్ ప్రకటించడంతో ఉదయం 10 గంటల నుంచి క్యూ లైన్ కంపార్ట్మెంట్ లోకి బారులు తీరారు బిర్యానీ ప్రియులు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఐదు రూపాయలకే బిర్యానీ అంటూ ఓ వ్యాపారి ఆఫర్ పెట్టాడు. దీంతో పెద్ద ఎత్తున క్యూ కట్టారు బిర్యానీ ప్రియులు.
దీనికోసం ఏకంగా ప్రైవేట్ సెక్యూరిటీ ఏర్పాటు చేసి మరి వేడి వేడి బిర్యానీని ఐదు రూపాయలకే ఇచ్చేశారు. నూతన వ్యాపారం కావడంతో రెస్టారెంట్ కి కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఇలాంటి జిమ్మిక్కులు చేస్తూనే ఉంటారు. దీనికి ట్రాఫిక్ పోలీసుల పర్మిషన్ తీసుకుని రూల్స్ పాటించాల్సి ఉంటుంది… ఆ తర్వాత మాత్రమే ఇలాంటి ఆఫర్స్ కి ఛాన్స్ ఇస్తారు పోలీసులు… ప్రస్తుతం రాజమండ్రిలో ఐదు రూపాయలు బిర్యానీకి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు పెద్ద ఎత్తున క్యూ కట్టారు బిర్యానీ ప్రియులు. బిర్యానీ సెంటర్ యాజమాన్యం రాజమండ్రిలో నూతన బ్రాంచ్ లో ఆఫర్ గురించి వారం రోజులుగా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. వైరల్ చేశారు. ఈ వార్త విన్న ఫుడ్ ప్రియులు ఉదయం 9 గంటలకి రెస్టారెంట్ కి చేరుకుని క్యూ లైన్ లో బారులు తీరారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నగ్నంగా రైలెక్కిన యువకుడు.. మహిళల కంపార్టుమెంట్‌లోకి వెళ్లి..
ఎక్కడికక్కడ గడ్డకట్టిన.. సరస్సులు, జలపాతాలు
ఈ విగ్గు రాజా.. విగ్గులు మారుస్తూ 50 మంది యువతులుకు మోసం
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..
ఇంటి పెరట్లో అర్ధరాత్రి వింత ఆకారం..
బావిలో రాకాసి అలలు.. చూసి షాకవుతోన్న జనం!
చెత్తలో రూ.11 కోట్ల లాటరీ టికెట్.. చివరికి ఊహించని ట్విస్ట్!
ట్రాక్‌పై దూసుకెళ్తున్న రైలు.. ఒక్కసారిగా ఊడిపోయిన చక్రాలు
హైదరాబాద్‌లో అతిపెద్ద క్రైసిస్.. ఇళ్లు వదిలి పారిపోతున్న పిల్లలు

