అదనపు ప్రోటీన్లు ఆ సమస్యకు కారణం..

TV9 Telugu

21 December 2024

అదనపు ప్రోటీన్లు కారణంగా బొటనవేలు నుంచి చీలమండల వరకు వాపు, విపరీతమైన నొప్పిని కలిగిస్తుంది. దినినే వైద్యులు గౌట్ అంటారు.

శరీరంలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నట్లయితే గాయాలు ఉన్నచోట దురద మొదలవుతుంది. కొన్ని రకాల కూరగాయలు తినడం వల్ల ఈ సమస్యను నివారించవచ్చు.

చలికాలంలో ఆల్కహాల్ డ్రింక్స్, కొవ్వు, ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారం యూరిక్ యాసిడ్ సమస్యను పెంచుతాయి.

ఈ సీజన్ లో పాలకూర తింటే యూరిక్ యాసిడ్ లెవల్స్ పెరగవు. అలాగే కీళ్ల నొప్పుల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు.

విటమిన్ సి శరీరంలో ఉన్న గౌట్ సమస్యలను నివారిస్తుంది. ఇది శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గిస్తుంది.

చలికాలంలో బ్రోకలీ పుష్కలంగా దొరుకుతుంది. ఈ కూరగాయలలో విటమిన్ సి అధికంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

దోసకాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరం నుంచి అదనపు యూరిక్ యాసిడ్‌ను బయటకు పంపుతుంది. ఆహారంలో దోసకాయను చేర్చుకోవచ్చు.

బీన్స్‌లో ఉండే ప్రోటీన్‌ యూరిక్ యాసిడ్ లక్షణాలను నివారిస్తుంది. ఆస్పరాగస్ కూరగాయలు శరీరం నుంచి అదనపు యూరిక్ యాసిడ్‌లను తొలగిస్తాయి.