కడుపులో మంట, గ్యాస్ట్రిక్.. వంటి జీర్ణ సంబంధిత సమస్యలు మనల్ని ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటి సమయంలో ఒక చిన్న బెల్లం ముక్క తింటే మంచిదని ఇంట్లో బామ్మలు చెబుతుంటారు
TV9 Telugu
పొడి దగ్గు, జలుబు, ఆస్తమా.. లాంటి సమస్యల నివారణ కోసం తయారు చేసే ఆయుర్వేద మందుల్లో బెల్లాన్ని ఉపయోగిస్తారు. లేదంటే రోజూ ఓ చిన్న బెల్లం ముక్క తిన్నా సరే
TV9 Telugu
తరచుగా పొడి దగ్గు బాధిస్తున్నట్లయితే ఒక గ్లాసు బెల్లం పానకంలో కొన్ని తులసి ఆకులు వేసి బాగా మరగనిచ్చి చల్లారనివ్వాలి. ఈ నీటిని రోజుకు రెండు లేదా మూడుసార్లు తీసుకుంటే ఫలితం ఉంటుంది
TV9 Telugu
ఇలా ఒకటేమిటి ఎన్నో ఆరోగ్య రహస్యాలున్నాయి బెల్లంలో. అందుకే మన దేశంలో శతాబ్దాలుగా ఆహారంలో బెల్లం వినియోగిస్తున్నాం
TV9 Telugu
అందుకే సహజ స్వీటెనర్ అయిన బెల్లం చక్కెరకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా పరిగణించబడుతుంది. అయితే ఇప్పటి వరకు మీకు చెరకుతో చేసిన బెల్లం మాత్రమే తెలుసు
TV9 Telugu
నిజానికి బెల్లంలో చాలా రకాలు ఉన్నాయి. ఏది తింటే ఎక్కువ మేలు చేస్తుందో ఇక్కడ తెలుసుకుందాం.. బెల్లంలో 8 నుండి 10 రకాలు ఉన్నాయి
TV9 Telugu
వీటిని చెరకు, ఖర్జూరం, కొబ్బరి, తాటి, మయూర్ బెల్లం ఇలా చాలానే ఉన్నాయి. తాటి, కొబ్బరితో చేసిన బెల్లం మరింత ఆరోగ్యకరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు
TV9 Telugu
వీటిల్లో ఐరన్, విటమిన్లు, మినరల్స్, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు.. ఇతర బెల్లం కంటే ఎక్కువ పరిమాణంలో ఉంటాయి. వీటిని తినడం వల్ల హిమోగ్లోబిన్, జీర్ణశక్తి, రోగనిరోధక శక్తి పెరుగుతుంది
TV9 Telugu
ఇవి చర్మం, గుండెకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండటానికి, భోజనం తర్వాత ప్రతిరోజూ 20 గ్రాముల బెల్లం తీసుకుంటే ఏ రోగం రాదు