పల్లీలు తిన్న తర్వాత మీరూ నీళ్లు తాగుతున్నారా? ఆగండాగండి..

20 December 2024

TV9 Telugu

TV9 Telugu

తక్షణ శక్తినిచ్చి అధిక పోషకాలను అధించే ఆహారాల్లో పల్లీలు మొదటి వరుసలో ఉంటాయి. ఇవి ఆరోగ్యంతోపాటు సౌందర్యపోషణలోనూ ప్రధాన పాత్ర వహిస్తాయి. అందుకే వేరుశనగలను సామాన్యుడి జీడిపప్పుగా వ్యవహరిస్తారు

TV9 Telugu

ఇవి రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. పల్లీలను ఆరేడు గంటలు నానబెట్టి వాడుకుంటే తేలికగా జీర్ణమవుతాయి. పచ్చి వేరుశనగ పప్పులను తింటే మరీ మంచిది. వీటిలో కొలెస్ట్రాల్‌ జీరో

TV9 Telugu

గుండె జబ్బులు తగ్గిస్తాయి. కండరాలకు బలాన్ని చేకూరుస్తాయి. ఎక్కువ మొత్తంలో మాంసకృత్తులు, అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి కండరాల ఆరోగ్యానికి ఉపకరిస్తాయి

TV9 Telugu

ముఖ్యంగా చలికాలంలో వేరుశెనగలను తప్పనిసరిగా తీసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. వీటిల్లో ఫైబర్, కాపర్, ఫోలేట్, విటమిన్ ఇ, ప్రోటీన్, ఫాస్పరస్,మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి

TV9 Telugu

వేరుశెనగలలో ప్రోటీన్, కాల్షియం అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలకు, ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. అయితే వేరుశెనగలు తిన్న తర్వాత, పొరబాటున కూడా కొన్ని పదార్థాలను తీసుకోకూడదంటున్నారు ఆరోగ్య నిపుణులు

TV9 Telugu

ముఖ్యంగా వేరుశెనగ పప్పు తిన్న తర్వాత ఐస్ క్రీం, లస్సీ లేదా షికంజీ వంటి చల్లని పదార్థాలు అస్సలు తాగకూడదట. అలాగే సాధారణ నీటి కూడా తాగకూడదట, ఎందుకంటే.. సాధారణంగా వేరుశెనగలు వేడి స్వభావం కలిగి ఉంటాయి

TV9 Telugu

వీటిని తిన్న తర్వాత చల్లటి వాటిని తీసుకుంటే, జలుబు, దగ్గు వంటి సమస్యలు తలెత్తుతాయి. అయితే పల్లీలు తిన్న తర్వాత టీ తాగవచ్చు. అయితే చల్లటి పదార్థాలు తాగడం లేదా తినడం మాత్రం పూర్తిగా మానేయాలి

TV9 Telugu

అలాగే వేయించిన పల్లీలను ఎల్లప్పుడూ పరిమిత మోతాదులోనే తీసుకోవాలి. ఒకవేళ ఎక్కువ పరిమాణంలో తింటే, ఎసిడిటీ, గ్యాస్, అపానవాయువు వంటి సమస్యలను కలిగిస్తుంది