- Telugu News Photo Gallery Cinema photos Can You Guess This Actress In This Photos She Is Divya Bharathi
Tollywood: ఫస్ట్ మూవీలో రొమాంటిక్ సీన్లతో రెచ్చిపోయిన బ్యూటీ.. అప్పట్లో ఇంత పద్దతిగా ఉండేదా..?
ఇప్పుడిప్పుడే తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగుపెడుతుంది. మొదటి సినిమా విడుదలకు ముందే సోషల్ మీడియాలో మాత్రం ఓరేంజ్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. కన్నడలో ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్. తొలి సినిమాలో రొమాంటిక్ సీన్లతో రెచ్చిపోయింది. ప్రస్తుతం తెలుగులో ఓ సినిమాలో నటిస్తుంది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరంటే..
Updated on: Dec 21, 2024 | 12:44 PM

బ్యాచిలర్ సినిమాతో కన్నడ సినీరంగంలోకి అడుగుపెట్టింది దివ్యభారతి. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక ఇందులో రొమాంటిక్ సీన్లతో రెచ్చిపోయి నటించింది.

దీంతో ఈ బ్యూటీకి ఒక్కసారిగా ఫాలోయింగ్ పెరిగిపోయింది. బ్యాచిలర్ చిత్రంలో సుబ్బలక్ష్మీ పాత్రకు తన నటనతో ప్రాణం పోసింది. ఇందులో జీవీ ప్రకాష్ హీరోగా నటించాడు. ఆ తర్వాత కన్నడలో పలు చిత్రాల్లో నటించింది.

1992 జనవరి 28న కోయంబత్తూరులో జన్మించింది దివ్యభారతి. బ్యాచిలర్ మూవీ తర్వాత జర్నీ అనే వెబ్ సిరీస్ చేసింది. ఇక ఇప్పుడు తమిళ, తెలుగు భాషల్లో కలిపి ఏకంగా ఐదు సినిమాలు లైన్‌లో పెట్టింది.

సుడిగాలి సుధీర్ హీరోగా తెరకెక్కుతున్న ‘G.O.A.T -Greatest Of All Time’ అనే చిత్రంతో దివ్యభారతి హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాతోనే ఆమె తెలుగు తెరకు పరిచయం కాబోతుంది.

అలాగే తమిళంలో ఇటీవలే మహారాజా చిత్రంతో సూపర్ హిట్ అందుకుంది. ఈ బ్యూటీ ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా ఈ అమ్మడు త్రోబ్యాక్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.




