- Telugu News Photo Gallery According to Baba Vanga astrology, financial benefits for these zodiac signs
బాబా వంగా జ్యోతిష్యం : దరిద్రం వదిలి కోటీశ్వరులయ్యే రాశుల వారు వీరే!
బాబా వంగ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన ప్రపంచంలో ముందే జరిగే అనేక సంఘటనల గురించి తెలియజేయడం జరిగింది. అయితే బాబా వంగా జ్యోతిష్యం ప్రకారం శ్రావణ మాసం నుంచి కొన్ని రాశుల వారికి అద్భుత ప్రయోజనాలు కలుగుతాయంట. ముఖ్యంగా దరిద్ర వదిలి కోటీశ్వరులు అవుతారంట. ఇంతకీ ఆ రాశుల వారు ఎవరో ఇప్పుడు చూద్దాం.
Updated on: Jul 21, 2025 | 8:56 PM

బాబా వంగ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన ప్రపంచంలో ముందే జరిగే అనేక సంఘటనల గురించి తెలియజేయడం జరిగింది. అయితే బాబా వంగా జ్యోతిష్యం ప్రకారం శ్రావణ మాసం నుంచి కొన్ని రాశుల వారికి అద్భుత ప్రయోజనాలు కలుగుతాయంట. ముఖ్యంగా దరిద్ర వదిలి కోటీశ్వరులు అవుతారంట. ఇంతకీ ఆ రాశుల వారు ఎవరో ఇప్పుడు చూద్దాం

మేష రాశి : బాబా వంగా జ్యోతిష్యం ప్రకారం శ్రావణ మాసం ప్రారంభం నుంచి మేష రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయంట. మరీ ముఖ్యంగా ఈ రాశి వారు ఈ సమయంలో అధిక మొత్తంలో డబ్బలు సంపాదించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు బాబా వంగా. అదే విధంగా ఈ రాశి వారు పెండింగ్‌లో ఉన్న పనులన్నీ సులభంగా పూర్తి చేస్తారంట. అన్నింట్లో విజయం వీరి సొంతం అవుతుందంట.

తుల రాశి : తుల రాశి వారికి శ్రావణ మాసం నుంచి ఆదాయం పెరుగుతుంది అంటున్నారు పండితులు.అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి. అంతే కాకుండా ఉద్యోగ ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయంట. వ్యాపారాల్లో కొన్ని కీలకమైన సమస్యలు, ఒత్తిళ్ల నుంచి విముక్తి లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి.

సింహ రాశి : సింహ రాశి వారికి గత కొంత కాలం నుంచి వేధిస్తున్న అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఆఫీసుల్లో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులు మంచి ఫలితాలు అందుకుంటారు. సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటారు.

ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి బాబా వంగా జ్యోతిష్యం ప్రకారం జూలై చివరి నుంచి పట్టిందల్లా బంగారమే కానుందంట. వీరు చాలా రోజుల నుంచి ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడతారంట. ఇంట్లో సంతోషకర వాతావరణం నెలకొంటుంది.నిరుద్యోగులు ఉద్యోగం పొందే ఛాన్స్ ఉంది. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.



