- Telugu News Photo Gallery Luck for those born under the four zodiac signs with three Raja Yogas in the month of Shravan
మూడు మహాయోగాలు : ఈ రాశుల వారు నక్కతోక తొక్కినట్లే!
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇక గ్రహాల కలియక లేదా సంచారం వలన మహా రాజయోగాలు ఏర్పడుతుంటాయి. అయితే ఈ సారి మూడు మహా రాజయోగాలు ఏర్పడుతున్నాయి. దీని వలన నాలు రాశుల వారి జీవితంలో డబ్బు, ఆనదం, ఆర్థిక వృద్ధి జరుగుతుంది అంట.
Updated on: Jul 21, 2025 | 8:55 PM

అయితే ఈ సారి శుక్రగ్రహం వృషభరాశిలో సంచారం చేయడం వలన మాలవ్య రాజయోగం ఏర్పడింది. అదే విధంగా మిథునరాశిలో, చంద్రుడు , బృహస్పతి కలయిక వలన గజకేసరి రాజయోగం ఏర్పడగా, క ర్కాటక రాశిలో సూర్యగ్రహం, బుధ గ్రహం కలయిక వలన బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. అయితే ఈ మూడు రాజయోగాలు ఒకే సారి ఏర్పడటం వలన నాలు రాశుల వారికి అద్భుత ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

మిథున రాశి: మూడు రాజయోగాల వల్ల మిథున రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఎవరైతే కొత్త వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటారో వారికి ఇది అనువైన సమయం. మీరు ప్రతి రంగంలోనూ అపారమైన విజయాన్ని పొందవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించడమే కాకుండా, ఉద్యోగులకు పదోన్నతితో పాటు జీతం కూడా పెరగే ఛాన్స్ ఉన్నదంట. సమాజంలో గౌరవం పెరుగుతుంది.

వృశ్చిక రాశి: మూడు రాజయోగాలు వృశ్చిక రాశి వారికి చాలా శుభ ప్రదం. వీరు ఆర్థికంగా దృఢంగా అవుతారు. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇవి మీకు ఆకస్మిక ధనలాభాన్ని కలిగిస్తాయి. అలాగే, వీరు మీ పూర్వీకుల ఆస్తి నుంచి ప్రయోజనాలను పొందవచ్చు. మీరు కొత్త వాహనం కొనుగోలు చేయవచ్చు. కొత్త ఆదాయ వనరులు పుట్టుకస్తాయి.

కర్కాటక రాశి: శ్రావణ మాసంలో ఏర్పడే 3 రాజయోగాలు కర్కాటక రాశి వారికి అదృష్టాన్ని తీసుకొస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. దీంతో కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా జీవిస్తారు. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది.లక్ష్మీ ఆశీస్సులతో ఇంట్లో సంపద పెరుగుతంది. మొండి బాకీలు వసూలు అవుతాయి.

కుంభ రాశి : కుంభ రాశి వారికి శ్రావణ మాసంలో ఏర్పడే మూడు రాజయోగాల వలన అద్భుతంగా ఉండబోతుంది. ఈ రాశి వారు నక్క తోక తొక్కినట్లే ఎందుకంటే? అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి. విద్యార్థులకు అద్భుతంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. చేపట్టిన ప్రతి పనుల్లో విజయం మీ సొంతం అవుతుంది.



