- Telugu News Photo Gallery Cinema photos Guest Appearances: Top Bollywood Actresses Who Rejected Telugu Film Offers
టాలీవుడ్‌లో గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తున్న హీరోయిన్లు
అతిథులు అంటే ఇలా వచ్చి అలా వెళ్లిపోతుంటారు.. అంతేకానీ ఇక్కడే అయితే ఉండిపోరు కదా..! తెలుగు ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్ల విషయంలో ఇదే జరుగుతుందిప్పుడు. కోట్లలో పారితోషికం ఇచ్చినా.. కావాల్సినంత క్రేజ్ వచ్చినా.. వాళ్లు మాత్రం మేం అతిథులమే అంటున్నారు. మరి టాలీవుడ్‌లో ఎవరా గెస్ట్ బ్యూటీస్..?
Updated on: Jul 21, 2025 | 10:07 PM

ఒక్కోసారి కొందరు హీరోయిన్లు చాలా తక్కువ టైమ్‌లోనే పాపులర్ అవుతుంటారు. రావాల్సిన దానికంటే ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంటారు. అందులో మృణాళ్ ఠాకూర్ ఒకరు. సీతా రామంతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ భామ.. హాయ్ నాన్నతో స్టార్ అయ్యారు.

కానీ ఫ్యామిలీ స్టార్‌తో రేసులో వెనకబడ్డారు. ఈ మధ్యే అడివి శేష్ డెకాయిట్ సినిమా ఓకే చేసారు. బాలీవుడ్‌లో మృణాళ్‌కు అవకాశాలు బాగానే వస్తున్నాయిప్పుడు.

ఈమె నటిస్తున్న సన్నాఫ్ సర్దార్ 2 జూలై 25న విడుదల కానుంది. ఈ సినిమాతో పాటు మరో మూడు హిందీ సినిమాలు ఈమె చేతిలో ఉన్నాయిప్పుడు. అందుకే తెలుగు ఇండస్ట్రీ వైపు చూడటమే మానేసారు మృణాళ్.

కియారా అద్వానీ సైతం అంతే..! అప్పుడెప్పుడో ఏడేళ్ళ కింద భరత్ అనే నేనుతో పరిచయమై.. వినయ విధేయ రామలో చరణ్‌తో జోడీ కట్టారు ఈ బ్యూటీ. మళ్లీ ఆరేళ్ళ తర్వాత అదే చరణ్‌తో గేమ్ ఛేంజర్ చేసారు. మధ్యలో ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో చెప్పారు కియారా. ఇకపై చేస్తారో లేదో క్లారిటీ లేదు.. వార్ 2లో నటిస్తున్నా అది కూడా హిందీ సినిమానే.

దిశా పటానీ కూడా పదేళ్ళ కింద రెండు తెలుగు సినిమాలు చేసారు. మళ్లీ మొన్న కల్కిలో కాసేపు కనిపించారు. కంగువాతో కాసేపు సూర్యతో మెరిసారు. సాహో తర్వాత తెలుగులో కనిపించడమే మానేసారు శ్రద్ధా కపూర్. వీళ్ళకి ఆఫర్స్ రాక కాదు.. వచ్చినా కూడా నో చెప్తున్నారు కాబట్టే టాలీవుడ్‌లో గెస్ట్ హీరోయిన్లు అయ్యారు.




