- Telugu News Photo Gallery Cinema photos Anupama Parameswaran Reveals Telugu Film Industry's Bias Against Female Led Films
Anupama Parameswaran: పోస్టర్‌పై అమ్మాయి బొమ్మ కనిపిస్తే థియేటర్‌కు రారు.. పచ్చి నిజాలు మాట్లాడిన అనుపమ
లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు థియేటర్లు ఇవ్వట్లేదా..? కనీసం ఓటిటి రేట్ కూడా ఇవ్వట్లేదా..? డిజిటల్ సంస్థలు పట్టించుకోవట్లేదా..? నిర్మాతలు కూడా లేడీ ఓరియెంటెడ్ అంటే వెనకడుగు వేస్తున్నారా..? ఈ డౌట్స్ అన్నీ ఇప్పుడెందుకు వచ్చాయబ్బా అనుకుంటున్నారా..? అయితే అనుపమ పరమేశ్వరన్ చేసిన ఈ కామెంట్స్ వినండి మీరే..
Updated on: Jul 21, 2025 | 10:11 PM

వింటున్నారు అనుపమ పరమేశ్వరన్ ఏమంటున్నారో.. పోస్టర్‌పై అమ్మాయి బొమ్మ కనిపిస్తే థియేటర్‌కు ఆడియన్స్ రారు.. స్క్రీన్స్ ఇవ్వరు.. ఓటిటి వాళ్లు కూడా పట్టించుకోరు అంటూ హార్ష్ రియాలిటీపై ఓపెన్ అయ్యారు ఈ బ్యూటీ.

పరదా సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్‌లో అనుపమ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయిప్పుడు. టిల్లు స్క్వేర్ తర్వాత తెలుగులో మళ్లీ ఈమె సినిమా చేయలేదు.. తమిళ, మలయాళంలో బిజీ అయిపోయారు.

తాజాగా ఈమె నటిస్తున్న పరదా విడుదలకు సిద్ధమైంది. నిజం చెప్పాలంటే ఈ సినిమా ఎప్పట్నుంచో రెడీగానే ఉంది.. కాకపోతే థియేటర్స్ దొరకట్లేదు.. రిలీజ్ డేట్ కూడా దొరకట్లేదు.. ఇదే విషయాన్ని ధైర్యంగా చెప్పారు అనుపమ.

ఆగస్ట్ 22న పరదా విడుదల కానుంది. సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రెగుల దర్శకుడు. అనుపమ కామెంట్స్‌తో ఇండస్ట్రీలో లేడీ ఓరియెంటెడ్ సినిమాల పరిస్థితి ఎంత దారుణంగా ఉందనేది అర్థమవుతుంది.

అయితే కథ బలంగా ఉంటే.. ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు కూడా రప్ఫాడించిన సందర్భాలు చాలా ఉన్నాయి. మరి పరదా ఏం చేస్తుందో చూడాలిక.




