- Telugu News Photo Gallery 4 Terrorists Killed by Indian army as part of Operation Trinetra 2 in Jammu Kashmir
Operation Trinetra-2: నలుగురు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టిన సైన్యం.. సత్ఫలితాలిస్తున్న ఆపరేషన్ త్రినేత్ర-2
జమ్మూ కశ్మీర్‌లో భద్రతా దళాలు ఆపరేషన్ త్రినేత్ర-2 ను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆపరేషన్ మంచి ఫలితాలను ఇస్తోంది. ఇప్పటివరకు ఈ ఆపరేషన్‌లో నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు అధికారులు వెల్లడించారు.
Updated on: Jul 18, 2023 | 11:48 AM

జమ్మూ కశ్మీర్‌లో భద్రతా దళాలు ఆపరేషన్ త్రినేత్ర-2 ను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆపరేషన్ మంచి ఫలితాలను ఇస్తోంది. ఇప్పటివరకు ఈ ఆపరేషన్‌లో నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు అధికారులు వెల్లడించారు. సోమవారం రాత్రి 11.30 PM గంటలకు భద్రతా బలగాలు సింధార అనే ప్రాంతలో డ్రోన్లతో గస్తీ చేపట్టాయి.

ఆ డ్రోన్లు ఉగ్రవాదుల కదలికలను గుర్తించాయి. ఇది చూసిన అధికారులు వెంటనే ముష్కరులపై కాల్పులు మొదలుపెట్టారు. మంగళవారం తెల్లవారుజాము వరకు ఈ కాల్పులు జరిగాయి. ఈ ఆపరేషన్‌లో ఇండియన్ ఆర్మీ ప్రత్యేక దళాలు, రాష్ట్రీయ రైఫిల్స్ అలాగే జమ్మూ కశ్మీర్ పోలీసులు సైతం పాల్గొ్న్నారు.

ఫూంచ్‌లోని సురాన్ కోట్ అనే ప్రాంతం సమీపంలో ఉన్న సింధార, మైదాన గ్రామాల్లో ఉగ్రవాదుల కదలికలను గుర్తించారు. చివరికి నలుగురు ఉగ్రవాదులన్ని మట్టుబెట్టినట్లు సైనిక అధికారులు తెలిపారు. ఆ ఉగ్రవాదుల నుంచి ఏకే-47 గన్లు, ఆయుధాలు అలాగే మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ముష్కరులు ఫూంఛ్ అలాగే రాజౌరీ ప్రాంతాల్లోనే దాడులు చేయడానికి వచ్చినట్లుగా సైనికులు పేర్కొన్నారు.

అయితే మృతి చెందిన ముష్కరుల్లో విదేశస్థులు కూడా ఉన్నట్లు సైన్యం వెల్లడించింది. వీళ్లు ఏర్పాటు చేసుకున్న స్థావరంలో గ్రానేడ్లు కూడా ఉన్నట్లు గుర్తించామని తెలిపింది. దీంతో మరింత అప్రమత్తమైన సైన్యం.. కాలాఝూలా అటవీ ప్రాంతంలో గాలింపు మొదలుపెట్టింది. ప్రస్తుతం ఫూంఛ్ ప్రాంతంలో ప్రతిఒక్క వాహనాన్ని సైనికులు తనిఖీలు చేస్తున్నారు.

ఏప్రిల్‌లో కూడా ఫూంఛ్‌లో ఓ సైనిక వాహనంపై ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ దుర్ఘటనలో 5గురు భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. జైషే మహమ్మద్, లష్కరే తొయిబా వంటి ఉగ్రవాద సంస్థలు.. క్షేత్రస్థాయి ఉగ్రవాదులతో కలిసి ఈ దాడులకు తెగబడినట్లు సైనికులు భావించారు. ఆ తర్వాత కూడా ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు దాడులు చేశారు.




