ప్రపంచంలోని టాప్100 టెస్టీ ఐస్ క్రీమ్స్ జాబితాలో భారతదేశపు 3 ఐస్ క్రీమ్స్!
ఐస్ క్రీమ్స్ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు, చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఐస్ క్రీమ్‌ను చాలా ఇష్టంగా తింటుంటారు. ఇక ముఖ్యంగా వేసవి వచ్చిందంటే చాలు చాలా మంది చాలా ఇష్టంగా ఐస్ క్రీమ్ తింటుంటారు. అయితే తాజాగా ప్రపంచంలోని 100 టేస్టీ ఐస్ క్రీమ్ జాబితాను విడుదల చేయగా, అందులో భారతీయ ఐస్ క్రీమ్స్ 3 ప్రపంచంలోని టేస్టీ ఐస్ క్రీమ్స్ జాబితాలో చోటు సంపాదించుకున్నాయి.
Updated on: Jul 11, 2025 | 12:55 PM

మ్యాంగో శాండ్ విచ్ ఐస్ క్రీమ్ అంటే చాలా మందికి ఇష్టం. దీనిని రుచి అద్భుతంగా ఉంటుంది. ఈ ఐస్ క్రీమ్‌ను మామిడి పండ్ల ముక్కలను, ఐస్ క్రీమ్ మధ్యలో, బిసెట్స్ వంటి వాటితో జత చేసి చేసి ఇస్తారు. దీనిని 1953లో ముంబైలోని ఇరానియన్ ఐస్ క్రీమ్ పార్లర్ కె. రుస్తుం కంపెనీ తయారు చేసింది. ఇది అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్కరి హృదయాలను గెలుచుకుంటుంది.

తయారు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మంది ఈ ఐస్ క్రీమ్‌ను చాలా ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఇది ఒక ప్రత్యేకమైన రుచిని కలిగి ఉం టుంది. ఇక ఈ ఐస్ క్రీమ్,రెండు సన్నని బిస్కెట్ల మధ్య గడ్డకట్టిన చిక్కటి మామిడి ఐస్ క్రీం. నోటిలో వేసిన వెంటనే కరిగిపోవడమే కాకుండా, శతాబ్దాల నాటి తీపి రుచిని మీరు పొందుతారు. ఈ ప్రత్యేక రుచి ఐస్ క్రీంకు ప్రపంచంలోని ఉత్తమ ఐస్ క్రీం జాబితాలో 22వ స్థానంలో నిలిచింది.

కర్ణాటకలోని మంగళూరు ప్రాంతానికి చెందిన స్పెషల్ ఐస్ క్రీమ్ గడ్బాద్ ఐస్ క్రీం. దీనిని వెనిలా, స్ట్రాబెర్రీస్, జెల్లీ, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, సిరప్ పొరలతో తయారు చేస్తారు. దీనిని టేస్ట్ చేస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. అంత అద్భుతంగా ఉంటుంది. అందుకే దీనిని ప్రపంచమే ఇష్టపడింది. అందువలన ప్రపచంలోని టేస్టీ 100 ఐస్ క్రీమ్స్‌లలో గడ్బాద్ ఐస్ క్రీమ్ 33వ స్థానాన్ని సంపాదించుకుంది.

కొబ్బరి ఐస్ క్రీమ్. నేచురల్ ఐస్ క్రీమ్, చాలా టేస్టీది కూడా. ఈ ఐస్ క్రీమ్ మొదటగా,1984లో ముంబైలోని జుహులో తయారు చేయబడింది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఈ ఐస్ క్రీమ్‌ను ఇష్టపడుతున్నారు. అయితే ఈ కొబ్బరి ఐస్ క్రీమ్‌ను సహజ కొబ్బరి, పండ్లతో మాత్రమే తయారు చేస్తారు. ఇది ఆరోగ్యానికి కూడా మంచిది. అందుకే ఈ ఐస్ క్రీమ్ ప్రపంచంలోని టేస్టీ ఐస్ క్రీమ్స్‌లలో 40వ స్థానంలో నిలిచింది.