చాణక్య నీతి : సమాజంలో నిన్ను ఎగతాళి చేసే అలవాట్లు ఇవే!
ఆచార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయనను కౌటిల్యుడు అని కూడా పిలుస్తారు. చాణక్యుడు తన జీవిత అనుభవాల ఆధారంగా నీతి శాస్త్రం అనే పుస్తకాన్ని రచించి, ఎన్నో విషయాలను తెలియజేయడం జరిగింది. అయితే ఒక వ్యక్తి సమాజంలో ఎగతాళి అవ్వడానికి ఆయన అలవాట్లే కారణం అంటున్నారు చాణక్యుడు.అవి ఏవి అంటే?
Updated on: Jul 11, 2025 | 12:55 PM

ఆచార్య చాణక్యుడు తన కాలంలో అత్యంత జ్ఞానవంతుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. ఇక ఈయన గొప్ప పండితుడు. అంతే కాకుండా ఈయన జీవితంలోని ప్రతి అంశాన్ని తన నీతిశాస్త్రం అనే పుస్తకం ద్వారా తెలియజేశారు. అవి నేటి మానవవాళికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అయితే చాణక్యుడు ఒక వ్యక్తి సమాజంలో ఎగతాళి కావడానికి కారణం తన అలవాట్లే అని పేర్కొన్నాడు.

సమాజంలో గౌరవం పొందాలంటే మంచి ప్రవర్తన, నడవడిక ఉండాలి. కానీ కొంత మంది వారి అలవాట్ల కారణంగా సమాజంలో గౌరవ మర్యాదలు కోల్పోతారు. అందుకే ప్రతి విషయాన్ని తెలుసుకొని, వాటి జాగ్రత్తగా చూసుకుంటే, మీ జీవితంలో మీరు అవమానానికి గురి కారు, మంచి గౌరవ మర్యాదలు లభిస్తాయని తెలిపారు. అయితే వ్యక్తిని సమాజంలో అవమానపరిచే అలవాట్లు ఏవి అంటే?

ప్రతి వ్యక్తికి వినయం అనేది చాలా అవసరం. ఎక్కడ, ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో తెలిసి ఉండాలి. ఇలాంటి వ్యక్తులు ఎక్కడా అవమానానికి గురి కారు. ఎప్పుడూ వినయంగా మాట్లాడాలి, మర్యాదగా ప్రవర్తించాలి. ఇతరులతో శత్రుత్వం అస్సలే పెంచుకోకూడదు. అలాంటి వ్యక్తులకే ప్రతి చోట గౌరవ మర్యాదలు లాభిస్తాయని చెబుతున్నాడు చాణ్యకుడు. లేని ఎడల ఆ వ్యక్తి ఎగతాళికి గురి అవతారంట.

కొంత మంది వ్యక్తులు తామే గొప్ప వారుగా భావించి ఇతరులను గౌరవించరు. కానీ ఇది అస్సలే మంచిది కాదు అని చెబుతున్నాడు చాణక్యుడు. మీరు ఎల్లప్పుడూ ఇతరులను అగౌరవిస్తే, ఇతరులు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు. ఇతరులను గౌరవించని వ్యక్తి సమాజంలో గౌరవ మర్యాదలు పొందలేరు అని చెప్పాడు చాణక్యుడు.

ఆహ్వానం లేని ఇంటికి వెళ్లడం అస్సలే మంచిది కాదు అంటారు. అయితే కొందరు పిలిచినా పిలవక పోయినా సరే కొంత మంది ఇంటికి వెళ్తుంటారు. కానీ ఇది మంచిది కాదంట. పిలవని ఇంటికి వెళ్లే వారు సమాజంలో అవమానానికి, ఎగతాళికి గురి అవుతారంట. ఇలాంటి వ్యక్తులకు ఎప్పుడూ సమాజంలో గౌరవం లభించదంట. అందుకే ఈ అలవాటు మార్చుకోవాలంట.



