జిమ్ చేసే వారికి అదిరిపోయే న్యూస్.. హై ప్రోటీన్ ఇండియన్ ఫుడ్స్ ఇవే
కండరాల అభివృద్ధిలో ప్రోటీన్ ఫుడ్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది. అయితే చాలా మంది వ్యాయామం చేసిన తర్వాత మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలనుకుంటారు. కొందరు ప్రోటీన్ షేక్స్ తాగుతుంటారు. అయితే ప్రోటీన్ షేక్స్ కంటే జిమ్ చేసిన తర్వాత కడుపు నిండిన భావన కలిగించడమే కాకుండా మంచి ప్రోటీన్‌తో శరీరానికి శక్తినిచ్చే భారతీయ వంటకాలు ఉన్నాయంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.
Updated on: Jul 11, 2025 | 11:05 AM

చనా మసాలా : శరీరానికి మేలు చేసే ఆహారపదార్థాల్లో చనా మసాలా ఒకటి. దీనిని శనగలతో చేస్తారు. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో హై ప్రోటీన్ ఉంటుంది. యూఎస్ డీఏ ప్రకారం 100 గ్రాముల చనాలో దాదాపు 19 గ్రాముల ప్రోటీన్ ఉంటుందంట. అందువలన దీనిని వ్యాయామం తర్వాత రోటీతో తీసుకోవడం వలన కండరాల వృద్ధికి ఇది దోహదం చేస్తుందంట.

సోయా కీమా : పోయా కీమాలో ఐరన్, కాల్షియం, వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందువలన జిమ్ తర్వాత ఇది తినడం చాలా మంచిదంట. దీనిని సోయా బీన్స్ తో తయారు చేస్తారు.అత్యధిక ప్రోటీన్ ఉంటే శాఖాహార వంటకం ఇది. దీనిని టమోటాలు, మసాలాలు, ఉల్లిపాయలు బీన్స్ తో చేస్తారు. దీనిలో అత్యధిక ప్రోటీన్ ఉంటుంది. అందువలన వ్యాయామం తర్వాత మల్టీ గ్రెయిన్ రోటీతో దీనిని తింటే ఆరోగ్యానికి చాలా మంచిదంట.

పెసరట్టు : ఇది చాలా మందికి ఇష్టమైన ఫేవరెట్ ఫుడ్. పెసరప్పుతో తయారు చేసే దీనిలో అత్యధిక ప్రోటీన్ ఉంటుంది. నాన బెట్టిన పెసరపప్పు, అల్లం, వంటి వాటితో చేస్తారు. దీనిని వ్యాయామం తర్వాత తినడం వలన త్వరగా కడుపు నిండిన భావన కలిగించడమే కాకుండా, శరీరానికి మంచి ప్రోటీన్‌ను అందిస్తుందంట. అందుకే జిమ్ ప్రియులకు మంచి ఆహారంలో పెసరట్టు కూడా ఒకటి.

బాయిల్డ్ ఎగ్ కర్రీ : ఉడికించిన కోడి గుడ్డు ఒక్కటి తింటే తర్వాత కాస్త నీరసంగా అనిపిస్తుంది. అందుకే మీ శరీరానికి మంచి ప్రోటీణ్ తో పాటు, శక్తి కూడా కావాలి అంటే ఉడికించిన కోడి గుడ్డును కర్రీలో వేసి, భోజనం చేయడం వలన ఇది శరీరానికి మేలు చేస్తుందంట. యూఎస్‌డీఏ ప్రకారం, ఒక పెద్ద కోడి గుడ్డులో దాదాపు ఆరు గ్రాముల ప్రోటీన్ ఉంటుందంట. అందువలన జిమ్ తర్వాత భోజనంలో బాయిల్డ్ ఎగ్ తినడం ఆరోగ్యానికి చాలా మంచిదంట.

పాలక్ పన్నీర్ : ఎంతో మంది ఫేవరెట్ వంటకంలో పాలక్ పన్నీర్ కూడా ఒకటి. ఇది మంచి రుచిని ఇవ్వడమే కాకుండా శరీరానికి తగిన ప్రోటీన్‌కూ అందిస్తుందంట. రోటీతో పాలక్ పన్నీర్ తీసుకోవడం వలన ఇది శరీరానికి శక్తినిస్తుందంట. అంతే కాకుండా వ్యాయామం తర్వాత తినడానికి బెస్ట్ ఫుడ్.



