- Telugu News Photo Gallery These are the famous Shiva temples in India to visit during the month of Shravan!
శ్రావణ మాసంలో భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన పుణ్యక్షేత్రాలివే!
పవిత్రమైన మాసాల్లో శ్రావణమాసం ఒకటి. శ్రావణ మాసంలో శివుడికి ప్రత్యేక పూజలు, ఉపావాసాలు ఉంటూ నిష్టగా శివయ్యను కొలుచుకుంటారు. ఇక ఈ సంవత్సరం (2025)లో శ్రావణ మాసం జూలై నెలలో ప్రారంభం కాబోతుంది. అయితే ఈ పవిత్రమైన మాసంలో భారతదేశంలో ఉన్న ఈ శివాలాయను సందర్శిస్తే చాలా మంచిదంట. అవి ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
Updated on: Jul 11, 2025 | 11:05 AM

సోమనాథ్ ఆలయం : సోమనాథ్ ఆలయం గుజరాత్ రాష్ట్రంలో ఉంది. శివుడి 12 జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఇది మొదటిది అంటారు. శ్రావణ మాసంలో సోమనాథుడిని దర్శించుకోవడం వలన సకల శుభాలు కలుగుతాయంట. అందుకే ఈ మాసంలో సందర్శించాల్సిన పుణ్యక్షేత్రాల్లో సోమనాథ్ ఆలయం కూడా ఒకటి అంటున్నారు పండితులు.

మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం :మధ్యప్రదేశ్ ఉజ్జయినీలో మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం ఉంది.వారణాసిలో కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం ఉంది, ఇది గంగానది ఒడ్డున ఉంటుంది. శ్రావణ మాసంలో ఈ జ్యోతిర్లింగాన్ని సందర్శించడం వలన ఎంతో పుణ్యం లభిస్తుందంట. ఎందుకంటే? అన్ని జ్యోతిర్లంగాల్లో ఇది చాలా ప్రత్యేకమైనదంట.

ఓంకారేశ్వర జ్యోతిర్లింగం : మధ్యప్రదేశ్ నర్మదా నది ద్వీపంలో ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఉంది. ఇది నర్మాద నది ఒడ్డున ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రం. ఇక్కడికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారంట. అయితే శ్రావణ మాసంలో ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటే సకల పాపాలు తొలిగిపోతాయంట.

వైద్యనాథ్ ఆలయం : మహారాష్ట్రలో వైద్యనాథ్ జ్యోతిర్లింగంగా పరమశివుడు దర్శనం ఇస్తారు. అక్కడి ప్రజలు ఆ లింగాన్ని అమృతేశ్వరుడు అని పిలుస్తారు. అమృతాన్ని లింగంలో దాచారని వారి నమ్మకం. ఇక్కడికి వెళ్తే సర్వరోగాలు నశించిపోవడమే కాకుండా ఆరోగ్యంగా ఉంటారంట. అందుకే తప్పనిసరిగా శివ భక్తులు శ్రావణ మాసంలో ఈ ఆలయాన్ని సందర్శించాలని చెబుతుంటారు.

శ్రీశైల మల్లిఖార్జున స్వామి ఆలయం : ద్వాదశ జ్యోతిర్లింగాలలో శ్రీశైలం దేవస్థానం ఒకటి. ఇది నంద్యాల జిల్లాలో ఉంది. నల్లమల కొండలలో ఉన్న ఈ శివాలయాన్ని సందర్శిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయంటారు పండితులు. ముఖ్యంగా శ్రావణ మాసంలో శ్రీశైలం మల్లిఖార్జున స్వామి వారి దర్శనం చాలా మంచిదంట.



