Telangana politics: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. 2022 సంవత్సరాంతానికి పూర్తిగా మారిపోయిన తెలంగాణ రాజకీయ ముఖచిత్రం.. హైలెట్స్ ఇవే..!

ఏడాది కాలంలో ఎంత మార్పు? 2022 జనవరిలో కనిపించిన రాజకీయ ముఖచిత్రం డిసెంబరు నాటికి పూర్తిగా మారిపోయింది. 12 నెలల క్రితం మూడు పార్టీల మధ్య పోరుగా కనిపించిన ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నం.

Telangana politics: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. 2022 సంవత్సరాంతానికి పూర్తిగా మారిపోయిన తెలంగాణ రాజకీయ ముఖచిత్రం.. హైలెట్స్ ఇవే..!
Kcr Bandi Sanjai Ys Sharmila Ka Paul Rs Praveen Kumar Chandrababu Revanth Reddy
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Dec 29, 2022 | 8:30 PM

2022 జనవరి నుంచి డిసెంబర్ దాకా కొనసాగిన 12 నెలల కాలంలో తెలంగాణ రాజకీయం పలు మలుపులు తిరిగింది. తెలంగాణలో అధికార పార్టీ బీఆర్ఎస్, బిజెపిల మధ్య వైరంతో 2022 ప్రారంభమైంది. 2022 చివరి అంకంలో రాజకీయ పరిణామాలను గమనిస్తే తెలంగాణవ్యాప్తంగా బహుళ పార్టీల హడావిడి పెరిగిపోయింది. మొన్నటి వరకు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు వస్తే బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ పార్టీల మధ్య త్రిముఖ పోరు జరుగుతుందని అంతా భావిస్తూ వచ్చారు. కానీ సంవత్సరాంతానికి వచ్చేసరికి తెలంగాణ రాజకీయ పోరు బరిలో పలు రాజకీయ పార్టీల సందడి పెరిగిపోయింది. ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వస్తే 70 శాతం సీట్లలో బహుముఖ పోరు నెలకొనే పరిస్థితి కనిపిస్తోంది.

తెలంగాణలో దాదాపు కనుమరుగు అయిపోయిందనుకున్న తెలుగుదేశం పార్టీని చంద్రబాబు ఉన్నట్టుండి యాక్టివేట్ చేయడంతో కొత్త చర్చ మొదలయింది. హఠాత్తుగా ఖమ్మంలో భారీ బహిరంగ సభను నిర్వహించిన చంద్రబాబు, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేయబోతున్నట్లుగా సంకేతాలిచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని పలు అసెంబ్లీ నియోజకవర్గాలలో టిడిపికి ఇప్పటికీ బలమైన ఓటు బ్యాంకు ఉందని చంద్రబాబు చెప్పకనే చెప్పారు. దాంతోపాటు మహబూబ్ నగర్, నల్గొండ వంటి జిల్లాల్లో కూడా టిడిపి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే పాత పది జిల్లాల్లో ఏకంగా ఐదు జిల్లాల్లో పోటీకి తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతోంది. తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన కాసాని జ్ఞానేశ్వర్ ను ఎంపిక చేసిన చంద్రబాబు, వ్యూహాత్మకంగా తెలంగాణలో పాగా వేసేందుకు పావులు కదుపుతున్నారు. అందులో భాగంగానే తమ సామాజిక వర్గం అధికంగా ఉన్న ఖమ్మం జిల్లాను ముందుగా లక్ష్యంగా చేసుకున్నట్లు అవగతం అవుతోంది. నిజానికి ఖమ్మం జిల్లాలో కొన్ని వారాల క్రితం జరిగిన ఒక కార్యక్రమంలో మాజీ మంత్రి సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు కీలకమైన కామెంట్లు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే అది ప్రస్తుతం ఆయన ఉన్న టిఆర్ఎస్ పార్టీ తరపునా లేక ఇండిపెండెంట్ గానా లేక ఏదైనా పార్టీ టికెట్ పైనా అన్నది మాత్రం ఆయన క్లియర్ గా చెప్పలేదు. తుమ్మెల కామెంట్ల తర్వాత ఆయన రాజకీయ భవిష్యత్తుపై పలు ఊహాగానాలు మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఆనాటి నుంచి తెలంగాణలో తెలుగుదేశం పార్టీలో కదలిక మొదలయింది అన్న సంకేతాలు వచ్చాయి. తుమ్మల నాగేశ్వరరావు మళ్లీ తనకు రాజకీయ జన్మనిచ్చిన తెలుగుదేశం పార్టీలో చేరతారని కొన్ని పత్రికలు రాసాయి కూడా. ఈ క్రమంలోనే చంద్రబాబు ఉన్నట్టుండి ఖమ్మం జిల్లా కేంద్రంలో బహిరంగ సభ నిర్వహించారు. తెలంగాణలో పోటీ చేయబోతున్నట్లుగా ప్రకటించారు. తుమ్మల నాగేశ్వరరావు లాంటి సీనియర్ నేతలు తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరితే.. చంద్రబాబు వ్యూహం ప్రకారం తెలంగాణలో పోటీకి దిగితే.. ఎన్నో కొన్ని సీట్లు వచ్చినా కూడా ఇక్కడి రాజకీయాల్లో చంద్రబాబు జోక్యం కచ్చితంగా పెరుగుతుంది అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇక ఆంధ్రప్రదేశ్లో తన సోదరుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ అక్కడి రాజకీయాలు వద్దనుకొని తెలంగాణలో రాజకీయ భవిష్యత్తును వెతుక్కుంటూ వైఎస్సార్టిపీని ఏర్పాటు చేసిన దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైయస్ షర్మిల రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పాదయాత్ర చేపట్టారు. గత ఏడాదికాలంగా ఆమె పాదయాత్ర నిర్వహిస్తున్నా తాజాగా ఆమె పాదయాత్రలో పలుచోట్ల ఉద్రిక్తత ఏర్పడింది. తొలుత సాదాసీదాగా ప్రసంగాలు కొనసాగించిన షర్మిల, ఇటీవల కాలంలో దూకుడు పెంచడమే ఆమె పాదయాత్రల సందర్భంగా ఉద్రిక్తతకు కారణమైంది. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను షర్మిల తీవ్ర పదజాలంతో విమర్శిస్తుండడం అధికార పార్టీ నేతలకు మింగుడు పడలేదు. ఫలితంగా కొన్ని ప్రాంతాలలో పాదయాత్రపై రాళ్లు రువ్విన ఉదంతాలు చోటుచేసుకున్నాయి. వైయస్సార్టిపీ శ్రేణులు కూడా అధికార టీఆర్ఎస్ పార్టీ శ్రేణులపై ఎదురుదాడికి దిగడంతో పలుచోట్ల ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఈ నేపథ్యంలో షర్మిల పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దాంతో సహజంగానే ఆమె కోర్టును ఆశ్రయించి పాదయాత్రకు అనుమతి పొందారు. అయితే షర్మిల కూడా తాను ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేయబోతున్నట్లు ఒకటి రెండు సందర్భాలలో ప్రకటించి ఉన్నారు. దివంగత వైఎస్సార్కు ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు నల్గొండ, రంగారెడ్డి, మెదక్ లాంటి జిల్లాలలో పలువురు అభిమానులు ఉన్నారు. దివంగత నేత అభిమానులుగా ఉన్న పలువురు నేతలు ఇప్పుడు షర్మిల పార్టీలో యాక్టివ్గా కనిపిస్తున్నారు. ఈ క్రమంలోనే షర్మిల పార్టీ ఖమ్మంతోపాటు మరో నాలుగు ఐదు జిల్లాల్లో పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ టిడిపి, వైయస్సార్టిపిలతోపాటు ఉభయ వామపక్షాలు 25 నుంచి 30 సీట్ల వరకు పోటీ చేస్తామని సంకేతాలిస్తున్నాయి. వీటికి తోడు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ చాప కింద నీరులా బిఎస్పిని విస్తరిస్తూ వస్తున్నారు. ఆయన తాను స్వయంగా ఎన్నికల బరిలో దిగడంతో పాటు 15 నుంచి 20 సీట్లలో పోటీ చేయాలన్న సంకల్పంతో క్యాడర్ని ఇంప్రూవ్ చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఇంకోవైపు ప్రజాశాంతి పార్టీతో ప్రజల్లో విస్తృతంగా పర్యటిస్తున్న క్రైస్తవ మత ప్రచారకుడు కే ఏ పాల్.. తెలంగాణలోని 119 అసెంబ్లీ సీట్లు పోటీ చేస్తానని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలను ఓడించి తానే అధికారాన్ని చేపడతారని ప్రకటనలు చేస్తున్నారు. ఇలా చూస్తే బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, టిడిపి, వైయస్సార్టిపి, ప్రజాశాంతి పార్టీ, బీఎస్పీ సిపిఐ, సిపిఎం ఇలా బహుళ పార్టీలు తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దాంతో వచ్చే ఎన్నికల్లో దాదాపు 70 శాతం సీట్లలో బహుముఖ పోరు ఉండే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

భారతదేశంలో క్రమంగా చిన్న పార్టీలకు ప్రాధాన్యత పెరుగుతుంది. కొన్ని సందర్భాలలో జాతీయ పార్టీలు చాలా చోట్ల ప్రాంతీయ పార్టీలపైనా, చిన్న పార్టీలపైనా ఆధారపడాల్సి వస్తోంది. జాతీయ పార్టీలు స్థానికంగా ఉన్న చిన్నాచితకా పార్టీలతో పొత్తు పెట్టుకుంటున్న పరిణామాలు కూడా ఇటీవల కాలంలో పెరిగిపోయాయి. యూపీ బీహార్, జార్ఖండ్, తమిళనాడు, కేరళ, అస్సాం, గోవా వంటి రాష్ట్రాల్లో చిన్నాచితక పార్టీలు జాతీయ పార్టీలు సారధ్యం వహిస్తున్న సంకీర్ణ ప్రభుత్వాలు భాగస్వాములుగా ఉన్నాయి. కేరళ, తమిళనాడు, బీహార్, ఉత్తరప్రదేశ్, అస్సాం రాష్ట్రాల్లో డజన్ల కొద్దీ చిన్న పార్టీలు యాక్టివ్గా కొనసాగుతున్నాయి. తెలంగాణను అటు చిన్న రాష్ట్రంగానూ చూడలేం.. ఇటు పెద్ద రాష్ట్రంగానూ భావించలేము. 119 మంది శాసనసభ్యులు ఉన్న రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 60 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకోవాలి. ఇలాంటి సందర్భంలో ఐదారుగురు ఎమ్మెల్యేలున్న చిన్న పార్టీ కూడా ఒక్కోసారి కింగ్ మేకర్ గా మారే అవకాశం ఉంది. ఇదంతా ఊహించే 2014లో 63 సీట్లతో అధికారాన్ని చేపట్టిన కేసీఆర్.. టిడిపి, కాంగ్రెస్ పార్టీలను లక్ష్యంగా చేసుకొని ఆపరేషన్ ఆకర్ష నిర్వహించి పలువురు ఎమ్మెల్యేలను తన పార్టీలోకి తీసుకున్నారు. ప్రభుత్వాన్ని బలంగా మార్చుకున్నారు. ఇదే వ్యూహాన్ని 2018 ఎన్నికల తర్వాత కూడా కేసీఆర్ కొనసాగించారు. 2018 ఎన్నికల్లో ఊహించిన దానికంటే ఎక్కువ సేట్లను గెలుచుకున్న కేసీఆర్.. ఆ తర్వాత టిడిపిని దాదాపు ఖాళీ చేశారు. కాంగ్రెస్ పార్టీలో మూడింట రెండు వంతుల మంది ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి చేర్చుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్షమే లేదు అంటే ఆశ్చర్యపోనక్కరలేదు. 2018లో కాంగ్రెస్ పార్టీ తరఫున 19 మంది ఎమ్మెల్యేలు గెలవగా ఉత్తంకుమార్ రెడ్డి లోక్ సభ సభ్యునిగా వెళ్లిపోవడంతో ఖాళీ అయిన హుజూర్ నగర్ ను జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది. దాంతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 18కి పడిపోయింది. ఆ తర్వాత అందులోంచి ఏకంగా 12 మంది ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. టిఆర్ఎస్కు మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం పార్టీ ఏడుగురు సభ్యులతో అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీగా మారింది. ఫలితంగా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయింది. ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా మారారు. 2018లో కేవలం ఒకే ఒక్క అసెంబ్లీ సీటును దక్కించుకున్న బిజెపి ఆ తర్వాత జరిగిన రెండు ఉప ఎన్నికల్లో మరో ఇద్దరు ఎమ్మెల్యేలను గెలిపించుకుంది. తొలుత దుబ్బాకలో రఘునందన్ రావు, ఆ తర్వాత హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ బిజెపి తరపున గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఆ తర్వాత ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో కూడా బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలిచినంత పని చేశారు. తాజాగా టిఆర్ఎస్ పార్టీ కాస్త భారత రాష్ట్ర సమితిగా మారిపోయిన నేపథ్యంలో తెలంగాణలోనూ రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. తమ పార్టీ పేరు నుంచి తెలంగాణను తొలగించిన గులాబీ దండు ఇకపై ఏ నేతను తెలంగానేతర ప్రజల్లో ప్రచారం చేయలేదు. దాన్ని ఆసరాగా తీసుకుంటున్న చంద్రబాబు, షర్మిల వంటి నేతలు తెలంగాణలో పాగా వేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అందుకు అనుగుణంగా చర్యలు కూడా ప్రారంభించారు. అయితే రాజకీయాలు గతంలో లాగా లేవు. ఒకసారి ఓడిపోయినా, గెలిచినా తమకు టికెట్ ఇచ్చిన పార్టీ పట్ల విధేయతతోనే ఆ తర్వాత ఐదేళ్లు ఏ నాయకుడు కొనసాగుతాడన్న నమ్మకం లేదు. గెలిచినవారు అధికార పార్టీలో చేరేందుకు, ఓడినవారు సైతం పార్టీ మారేందుకు తమ పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో చిన్నాచితకా పార్టీల తరఫున ఎవరైనా గెలిచినా.. వారు అధికారం చేపట్టే పార్టీ వైపు వెళ్లరు అని అనుకోలేము. మొత్తం మీద బహుళ పార్టీల ఎంట్రీతో తెలంగాణ రాజకీయ ముఖచిత్రం 2022 సంవత్సరాంతానికి పూర్తిగా మారిపోయిందనే చెప్పాలి.

చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
డయాబెటిస్‌లో పుచ్చకాయ తినడం మంచిదేనా..? తింటే ఏమవుతుంది
డయాబెటిస్‌లో పుచ్చకాయ తినడం మంచిదేనా..? తింటే ఏమవుతుంది
హాట్..హాట్ సమ్మర్‌లో కూల్ కూల్ కూలర్స్..తక్కువ ధరలో ది బెస్ట్ ఇవే
హాట్..హాట్ సమ్మర్‌లో కూల్ కూల్ కూలర్స్..తక్కువ ధరలో ది బెస్ట్ ఇవే
మొబైల్ డేటా, చార్జింగ్ ఎక్కువసేపు రావాలంటే.. ఈ టిప్స్ ట్రై చేయండి
మొబైల్ డేటా, చార్జింగ్ ఎక్కువసేపు రావాలంటే.. ఈ టిప్స్ ట్రై చేయండి
ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?
ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?
శివుడు దక్షుడికి మేక తలను ఎందుకు ఇచ్చాడు? ఆసక్తికరమైన కథ ఏమిటంటే
శివుడు దక్షుడికి మేక తలను ఎందుకు ఇచ్చాడు? ఆసక్తికరమైన కథ ఏమిటంటే
మరో జైత్రయాత్రకు సీఎం జగన్‌ సిద్ధం.. ఇక నాన్‌స్టాప్ ప్రచారం!
మరో జైత్రయాత్రకు సీఎం జగన్‌ సిద్ధం.. ఇక నాన్‌స్టాప్ ప్రచారం!
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
5స్టార్‌ హోటల్‌లో ఉద్యోగం మానేసి వీధిలో వ్యాపారం పెట్టాడు!
5స్టార్‌ హోటల్‌లో ఉద్యోగం మానేసి వీధిలో వ్యాపారం పెట్టాడు!
ఈ జిల్లా గులాబీ అడ్డా.. సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన మాజీ మంత్రి
ఈ జిల్లా గులాబీ అడ్డా.. సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన మాజీ మంత్రి
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా