కాలకేయ శకానికి సహకరించిన ఇమ్రాన్‌ సేన.. ఇప్పుడు వాళ్లతోనే ఇండియాపై దాడులకు వ్యూహ రచన చేస్తోందా?

భారత్‌పై పగ పగ అని భగభగ మండిపోతున్న పాపిస్టి పాకిస్తాన్‌ ఇప్పుడు అఫ్గన్‌ కేంద్రంగా కుట్రలు రచిస్తోందా..? కాలకేయ శకానికి సర్వం

కాలకేయ శకానికి సహకరించిన ఇమ్రాన్‌ సేన.. ఇప్పుడు వాళ్లతోనే ఇండియాపై దాడులకు వ్యూహ రచన చేస్తోందా?
Taliban
Follow us

|

Updated on: Sep 24, 2021 | 1:58 PM

India – Pakistan – Afghanistan: భారత్‌పై పగ పగ అని భగభగ మండిపోతున్న పాపిస్టి పాకిస్తాన్‌ ఇప్పుడు అఫ్గన్‌ కేంద్రంగా కుట్రలు రచిస్తోందా..? కాలకేయ శకానికి సర్వం సహకరించిన ఇమ్రాన్‌ సేన.. ఇప్పుడు వాళ్ల సాయంతోనే ఇండియాపై దాడులకు వ్యూహరచన చేస్తోందా? కశ్మీర్‌ను తమ చేతుల్లోకి తీసుకునేలా పావులు కదుపుతుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాలిబన్లకు సాయం వెనుక కశ్మీర్‌ హస్తగతానికి కుట్రలు రచించినట్టు తెలుస్తోంది. ఇందులోభాగంగా ఉగ్రక్యాంప్‌లు ఏర్పాటు చేసి.. వాళ్లకి ట్రైనింగ్‌ ఇచ్చి సిరియల్ ఎటాక్స్‌కి సిద్దం అవుతుందనే నిఘావర్గాల హెచ్చరికలతో భారత్ అలర్ట్‌ అయింది.

భారత్‌లోకి ఎంటరయ్యేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తున్నారు ఉగ్రవాదులు. అందుకే ఈ మధ్య ఎక్కువగా ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి. భౌగోలిక, వాతావరణ పరిస్థితుల్ని క్యాష్ చేసుకోవాలన్నది వాళ్ల ఆలోచనగా కనిపిస్తోంది. ఇక అక్టోబర్‌, నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లో భారీగా మంచు కురుస్తుంది. చలి విపరీతంగా ఉంటుంది. దీంతో సైన్యం పహారా, కదలికలు తగ్గితే చొరబాట్లు స్పీడప్ చేయాలన్ని చూస్తున్నారు.

రాబోయే పండుగ రోజుల్లో భారత్‌లో భారీ దాడులకు తెగబడేందుకు ఉగ్ర సంస్థలు కుట్రపన్నాయి. దేశంలోకి చొరబడేందుకు 40 మంది అఫ్గాన్‌ ఉగ్రవాదులు పన్నాగాలు రచిస్తున్నారు. పాక్‌ మద్దతుతో దేశంలోకి చొరబడేందుకు వాళ్లంతా సిద్ధంగా ఉన్నారు. పాక్‌లోని ఐఎస్‌ఐ అండతో సరిహద్దులు దాటేందుకు అఫ్గాన్‌ మూకలు ప్రయత్నిస్తున్నాయని లెటెస్ట్‌గా నిఘా వర్గాలు హెచ్చరించాయి. అసలు భారత్‌లోకి చొరబాట్లు ఎలా సాధ్యం? ఏ ప్రాంతాల నుంచి జరుగుతాయో ఓ సారి చూద్దాం.

ఈ మధ్య జమ్ముకశ్మీర్‌లోని ఉరీ సెక్టార్‌ వద్ద నియంత్రణ రేఖ సమీపంలో పాక్‌ నుంచి ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాల్ని సైన్యం భగ్నం చేసింది. ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చి వారి నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకుంది. మొన్నామధ్య 8మంది పట్టుబడ్డారు. విచారణలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. కసబ్‌కి ఎక్కడైతే ట్రైనింగ్‌ ఇచ్చారో వాళ్లకి కూడా అక్కడే ఇచ్చారని.. ఉగ్రమూక టీమ్‌ను దావూద్ సోదరుడు లీడ్‌ చేస్తున్నట్టు తేలింది.

నిజానికి అఫ్ఘన్‌లో పరిణామాలను మొదటినుంచి నిశితంగా గమనిస్తున్న భారత్‌.. ఆచితూచి వ్యవహరిస్తోంది. కశ్మీర్‌ను స్వాధీనం చేసుకునేందుకు పాక్‌ కుట్రలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా భద్రతను కట్టుదిట్టం చేసింది. ఉగ్రమూకలు బోర్డర్‌లోకి ఎంటరైతే ఆన్‌ ది స్పాట్‌ ఏరివేసేలా సమాయత్తమవుతోంది.

Read also: Arjun Tanks: శత్రు దేశాల గుండెల్లో దడ మొదలైనట్టే.. రక్షణ శాఖ అమ్ములపొదిలోకి అత్యాధునిక అస్త్రం