Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Arjun Tanks: శత్రు దేశాల గుండెల్లో దడ మొదలైనట్టే.. రక్షణ శాఖ అమ్ములపొదిలోకి అత్యాధునిక అస్త్రం

భారత శత్రు దేశాలకు ఇక గుండెల్లో దడ మొదలైనట్టే.. రక్షణశాఖ అమ్ములపొదిలోకి మరో అత్యాధునిక అస్త్రం రాబోతోంది. భారత రక్షణ

Arjun Tanks: శత్రు దేశాల గుండెల్లో దడ మొదలైనట్టే.. రక్షణ శాఖ అమ్ములపొదిలోకి అత్యాధునిక అస్త్రం
Arjun War Tank
Follow us
Venkata Narayana

|

Updated on: Sep 24, 2021 | 1:41 PM

Arjun War Tanks: భారత శత్రు దేశాలకు ఇక గుండెల్లో దడ మొదలైనట్టే.. రక్షణశాఖ అమ్ములపొదిలోకి మరో అత్యాధునిక అస్త్రం రాబోతోంది. భారత రక్షణ వ్యవస్థను బరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా అత్యాధునిక 118 అర్జున్‌ మెయిన్‌ బాటిల్‌ యుద్ధట్యాంక్‌ల తయారీకి చర్యలు చేపట్టింది ప్రభుత్వం. అర్జున్‌ MK 1A ట్యాంకులను కొనుగోలు చేయనుంది.

మొత్తం 7 వేల 523 కోట్లతో అర్జున్ Mk-1A ట్యాంకులను కొనుగోలు చేయనుంది కేంద్ర ప్రభుత్వం. ఈ యుద్ధ ట్యాంకుల కొనుగోలుకు చెన్నై ఆవడిలోని హెవీ వెహికల్స్‌ ఫ్యాక్టరీకి ఆర్డర్‌ ఇచ్చింది. MBT MK-1A కొత్త వేరియంట్ అర్జున్‌ యుద్ధట్యాంక్‌లో మొత్తం 72 అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. 2004 నుంచి ఎంబీటీ యుద్ధ ట్యాంకులను భారత రక్షణశాఖ ఉపయోగిస్తోంది. స్వదేశీ పరిజ్ఞానంతో ఈ యుద్ధ ట్యాంకులను తయారు చేస్తున్నారు. 14 ప్రధాన మార్పులతో MBT MK 1A యుద్ధ ట్యాంకులను అభివృద్ధి చేశారు.

యుద్ధట్యాంకు బరువు 68.5 టన్నులుగా ఉంటుంది. గతంలో కంటే ఫైర్ పవర్ ను పెంచారు. మరోవైపు యుద్ధట్యాంక్‌ను వేగంగా తరలించే సౌకర్యం కూడా కొత్త వేరియంట్‌లో ఉంది. ఈ యుద్ధట్యాంక్‌లో మొత్తం 72 సరికొత్త ఆధునిక ఫీచర్లున్నాయి. పగలు, రాత్రి సమయంలోనూ లక్ష్యాలను ఛేదించే శక్తి ఉండటం ఈ యుద్ధట్యాంక్‌ ప్రధాన బలం. గన్నర్స్ గురి తప్పకుండా మెయిన్ సైట్ వ్యూ ఇందులో ఉంది. ఆటో మేటిక్‌ టార్గెట్ ట్రాకింగ్ సిస్టమ్‌ యుద్ధట్యాంకులో అమర్చారు. కదులుతున్న శత్రు దేశాల లక్ష్యాలను కూడా ఇది చేధిస్తుంది. MBT MK 1A యుద్ధ ట్యాంకు గన్ కంప్యూటర్‌లో నియంత్రణలో ఉంటుంది. భారీ స్థాయిలో కాల్పులు జరిపే 120MM రైఫిల్ గన్ ఈ యుద్ధట్యాంక్‌లో ఉంది.

థర్మోబారిక్ పెనిట్రేషన్ కమ్ బ్లాస్ట్ అమ్మునేషన్ శక్తి కలిగి ఉంది ఈ యుద్ధట్యాంక్‌. గాలిలోని ఆక్సిజన్ గ్రహించి భారీ పేలుడు చేసే శక్తి దీనికుంది. ప్రత్యర్థి ట్యాంకుల నుంచి రక్షించే కవచం కంచన్ దీని ప్రత్యేకతల్లో ఒకటి. మొత్తంగా శత్రు దేశాల గుండెల్లో దడ పుట్టించే అత్యాధునిక ఆయుధంగా అర్జున్‌ MBT MK 1A యుద్ధట్యాంక్‌ ను రూపొందిస్తున్నారు.

Read also: YSR Statue: చిత్తూరు జిల్లాలో కలకలం.. వైయస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు