Huzurabad : హుజురాబాద్‌లో హీటెక్కిన రాజకీయం.. దూకుడు పెంచిన టీఆర్ఎస్, బీజేపీ.. సైలెంట్‌గా కాంగ్రెస్..!

టీఆర్ఎస్ లో హుజూరాబాద్ ఆశావాహులు పెరుగుతున్నారు.. సర్వే ఆధారంగా కేసిఆర్ అభ్యర్థి ప్రకటించనున్నారు.. దాదాపు అన్ని గ్రామాల్లో.. ఎన్నికల వాతరణం కనబడుతోంది...

Huzurabad : హుజురాబాద్‌లో హీటెక్కిన రాజకీయం..  దూకుడు పెంచిన టీఆర్ఎస్, బీజేపీ.. సైలెంట్‌గా కాంగ్రెస్..!
Huzurabad By Election
Follow us

|

Updated on: Jun 27, 2021 | 6:38 PM

Huzurabad politics : హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి ఇంకా ఉప ఎన్నికల నోటిఫికేషన్ రాలేదు.. కానీ , ఇక్కడ రాజకీయం మాత్రం ఫుల్ హీటెక్కుతోంది. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఎంఎల్ఎ పదవికి రాజీనామా చేసిన వెంటనే.. టీఆర్ఎస్ నేతలు రంగంలో కి దిగారు. ముందుగా రాజేందర్ అనుచరులను టీఆర్ఎస్ కు తీసుకునే ప్లాన్ లో సక్సెస్ అయ్యారు. మెజారిటీ ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ వెంట ఉన్నారు. జిల్లా కు చెందిన మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ అక్కడే మకాం వేస్తున్నారు. ఇప్పటికే మండలాల వారిగా ఇంచార్జి లను నియమించారు.

మంత్రులు, ఎంఎల్ఎ లు , ఎంఎల్సీలు హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.. ప్రతి గ్రామంలో కార్యకర్తల సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన పథకాలను టీఆర్ఎస్ ఫోకస్ చేస్తుంది. అభ్యర్థి ముఖ్యం కాదూ.. కేసీఆర్ చేసిన అభివృద్ధి ముఖ్యమంటూ ప్రజల్లోకి వెళ్తుంది టీఆర్ఎస్. ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో క్లారిటి లేదు.. అయినా.. టిఆర్ఎస్ ఏ చిన్న అవకాశం వదిలిపెట్టడం లేదు.. ఇప్పటికే పలువురు బీజేపీ నేతలను టీఆర్ఎస్ చేర్చుకుంది.

మరోవైపు, రోజు. రోజుకు టీఆర్ఎస్ లో హుజూరాబాద్ ఆశావాహులు పెరుగుతున్నారు.. సర్వే ఆధారంగా కేసిఆర్ అభ్యర్థి ప్రకటించనున్నారు.. దాదాపు అన్ని గ్రామాల్లో.. ఎన్నికల వాతరణం కనబడుతోంది. బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ పోటీ చేయనున్నారు. రాజేందర్ నియోజకవర్గంలో విస్తృత పర్యటన చేస్తున్నారు. ఆత్మగౌరవం పేరుతో సెంటిమెంట్ ను వాడుతున్నారు. కాంగ్రెస్ మాత్రం సైలెంట్ గా ఉంది. గత ఎన్నికల్లో పోటీ చేసిక పాడి కౌశిక్ రెడ్డి.. కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తున్నారు. ఆయన టీఆర్ఎస్ లో చేరుతారనే ప్రచారంతో కాంగ్రెస్ శ్రేణులు అయోమయంలో ఉన్నారు.

Read also : Kodali Nani : అధికారం కోసం క్షుద్ర పూజలు చేసిన దుర్మార్గుడు చంద్రబాబు.. బీజేపీ, జనసేన ఉనికిలో లేని పార్టీలు : కొడాలి నాని

ప్రేమ పేరుతో నయవంచన! భార్య మెడలో తాళి తెంచి.. నడిరోడ్డుపై వదిలేసి
ప్రేమ పేరుతో నయవంచన! భార్య మెడలో తాళి తెంచి.. నడిరోడ్డుపై వదిలేసి
టాలీవుడ్ హీరోలకు చెమటలు పట్టిస్తున్న శ్రీలీల.. అసలు మ్యాటర్ ఇదే
టాలీవుడ్ హీరోలకు చెమటలు పట్టిస్తున్న శ్రీలీల.. అసలు మ్యాటర్ ఇదే
హనుమాన్ ఓటీటీలో ఆ సీన్స్ కట్ చేశారా..?మరి ఎనిమిది నిముషాలు ఏమైంది
హనుమాన్ ఓటీటీలో ఆ సీన్స్ కట్ చేశారా..?మరి ఎనిమిది నిముషాలు ఏమైంది
కరెంట్‌ బిల్లు పెరగకుండా.. ఏసీల వాడొచ్చా? అదెలా?
కరెంట్‌ బిల్లు పెరగకుండా.. ఏసీల వాడొచ్చా? అదెలా?
ఎన్‌సీఏ నుంచి కేఎల్‌కు గ్రీన్ సిగ్నల్.. కానీ, ఓ కండీషన్..
ఎన్‌సీఏ నుంచి కేఎల్‌కు గ్రీన్ సిగ్నల్.. కానీ, ఓ కండీషన్..
అహోబిలంలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు, భక్తుల ప్రత్యేక పూజలు
అహోబిలంలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు, భక్తుల ప్రత్యేక పూజలు
విషాదం..పెళ్లి బరాత్‌లో డ్యాన్స్‌ చేస్తూ గుండెపోటుతో యువకుడు మృతి
విషాదం..పెళ్లి బరాత్‌లో డ్యాన్స్‌ చేస్తూ గుండెపోటుతో యువకుడు మృతి
రోడ్లపై చక్కర్లు కొడుతున్న కొత్త ఎలక్ట్రిక్ కారు..
రోడ్లపై చక్కర్లు కొడుతున్న కొత్త ఎలక్ట్రిక్ కారు..
తెలుగు రాష్ట్రాల్లో మరోసారి తగ్గిన బంగారం, వెండి ధరలు..
తెలుగు రాష్ట్రాల్లో మరోసారి తగ్గిన బంగారం, వెండి ధరలు..
'అరకొర వివరాలు వెల్లడిస్తారా?' ఎస్‌బీఐపై సుప్రీంకోర్టు సీరియస్‌
'అరకొర వివరాలు వెల్లడిస్తారా?' ఎస్‌బీఐపై సుప్రీంకోర్టు సీరియస్‌