PV Narasimha Rao : శత జయంతి ఉత్సవాల శుభ సందర్భంగా పీవీకి మరో అరుదైన గౌరవం – తొమ్మిది గ్రంధాల ఆవిష్కరణ!.. రేపే..

అపర చాణుక్యుడు, బహుభాషా కోవిధుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, భారతదేశ మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను ఘనంగా..

PV Narasimha Rao : శత జయంతి ఉత్సవాల శుభ సందర్భంగా పీవీకి మరో అరుదైన గౌరవం - తొమ్మిది గ్రంధాల ఆవిష్కరణ!.. రేపే..
Pv Narasimha Rao
Follow us
Venkata Narayana

|

Updated on: Jun 27, 2021 | 7:04 PM

PV Narasimha Rao Books : అపర చాణుక్యుడు, బహుభాషా కోవిధుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, భారతదేశ మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే ఆ దిశగా ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తోంది. పీవీ దేశానికి అందించిన విశిష్ట సేవలను గొప్పగా తలుచుకునే విధంగా, చిరస్మరణీయంగా నిలిచే విధంగా శత జయంతి ఉత్సవాలను ఏడాదికాలంగా తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. విద్యావేత్తగా, సాహితీవేత్తగా సాహితీ రంగంలో విశేష కృషి చేసిన పీవీ నరసింహారావుకు నివాళిగా, మహోన్నత మూర్తిమత్వం ఉన్న పీవీకి వ్యక్తిత్వాన్ని, రాజనీతి, పాలన దక్షతను, ఆర్థిక సంస్కరణలలో వారి కృషిని ఆవిష్కరించడమే ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు.

ఈ నేపథ్యంలో సీఎం కే చంద్రశేఖర్ రావు ఆదేశాలమేరకు క్రీ.శే ”పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల కమిటీ”ని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి చైర్మన్ గా సీనియర్ పార్లమెంట్ సభ్యుడు కె కేశవ రావుని నియమించారు. పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల కోర్ కమిటీ, పుస్తక ప్రచురణల కోసం ప్రత్యేకంగా ఒక ఉప కమిటీని నిపుణులతో ఏర్పాటు చేశారు.. ఈ ఉప కమిటీ పర్యవేక్షణలో దాదాపు సంవత్సర కాలపు కృషితో కొన్ని పుస్తకాలను వెలుగులోకి తెచ్చారు.

ఇక ఈ గ్రంధాల ప్రచురణ బాధ్యతను తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ సాహిత్య అకాడమీలకు అప్పగించింది. అలా ఇప్పుడు మొత్తం 8 పుస్తకాలను ప్రచురించారు. వాటిలో పీవీ నర్సింహారావు రాసినవి 4 పుస్తకాలు కాగా, మిగతావి ఆయన కృషిని, జీవితాన్ని విశ్లేషించే గ్రంథాలు కావడం విశేషం. వీటిని శతజయంతి ముగింపు ఉత్సవాల సందర్భంగా ప్రజలకు అంకితం చేయనున్నారు.

గ్రంధాల వివరాలు:

శ్రీ పీవీ నరసింహారావు రచనలు (ఇంగ్లీష్ లో)..

1. Influence of India’s Culture on the West and Other Speeches: పశ్చిమ దేశాలపై భారత సంస్కృతి ప్రభావంపై పీవీ నరసింహారావు గారి ప్రసంగాల సంకలనం 2. The Granny & Other Stories: పీవీ నరసింహారావు గారు రాసిన 8 అరుదైన కథల సంకలనం. ఇందులో ప్రసిద్ధ గొల్ల రామవ్వ కథ కూడా ఉంది. 3. The Meaning of Secularism and Other Essays: పీవీ నరసింహారావు గారు వివిధ సందర్భాలలో రాసిన వ్యాసాల సంకలనం 4. Thus Spake PV-Interviews with P.V.Narasimha Rao: పీవీ నరసింహారావు గారిని వేర్వేరు మీడియా ప్రతినిధులు చేసిన ఇంటర్వ్యూల సంకలనం

శ్రీ పీవీ గారిపై ఇతర పుస్తకాలు (ఇంగ్లీష్ లో)..

5. P.V. Narasimha Rao-Architect of Inida’s Reforms: పీవీ నరసింహారావు చేసిన ఆర్థిక సంస్కరణలపై, ఆయన పాలనా రీతులపై దేశ, విదేశాలకు చెందిన అగ్ర నాయకులు రాసిన వ్యాసాల సంకలనం. ఈ కాఫీ టేబుల్ బుక్ కు ప్రముఖ జర్నలిస్టు సంజయ బారు సంపాదకుడిగా వ్యవహరించారు. 6. Legend in Lines: పీవీ నరసింహారావు గారు స్ఫూర్తిగా దాదాపు 125కు పైగా అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర కార్టూనిస్ట్ లు వేసిన క్యారికేఛర్ ల సంకలనం 7. Chanakya: పీవీ నరసింహారావు గారి జీవిత చరిత్రపై వెలిజాల చంద్రశేఖర్ రాసిన పుస్తకం, శ్రీ పీవీ గారిపై తెలుగులో ప్రచురించిన పుస్తకాలు 8. నమస్తే పీవీ: పీవీ నరసింహారావు గారి గురించి నమస్తే తెలంగాణ పత్రికలో ప్రచురించిన వ్యాసాల సంకలనం 9. కాలాతీతుడు: పీవీ నరసింహారావు గారి జీవితం స్ఫూర్తితో 143 మంది కవుల కవితా సంకలనం

ఈ పుస్తకాలను రేపు (జూన్ 28)న పీవీ జ్ఞానభూమిలో జరిగే పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలలో భాగంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర రాజన్, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా ఆవిష్కరణ చేయనున్నారు.

Read also : Kodali Nani : అధికారం కోసం క్షుద్ర పూజలు చేసిన దుర్మార్గుడు చంద్రబాబు.. బీజేపీ, జనసేన ఉనికిలో లేని పార్టీలు : కొడాలి నాని