5 Easy Ayurvedic Ways : జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను పెంచుకోవడానికి 5 సులువైన ఆయుర్వేద మార్గాలు.. ఏంటో తెలుసుకోండి..
5 Easy Ayurvedic Ways : ఈ పోటీ ప్రపంచంలో చాలామంది యువత జ్ఞాపకశక్తి, ఏకాగ్రత లేక వెనుకబడిపోతున్నారు.
5 Easy Ayurvedic Ways : ఈ పోటీ ప్రపంచంలో చాలామంది యువత జ్ఞాపకశక్తి, ఏకాగ్రత లేక వెనుకబడిపోతున్నారు. చిన్న చిన్న విషయాలను కూడా మరిచిపోతున్నారు. ఏదైనా సాధించాలంటే మానసికంగా ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యం. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెంచుకోవడానికి ఆయుర్వేదంలో కొన్ని సులువైన మార్గాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. బ్రాహ్మి ఒక పురాతన మూలిక. ఇది ఔషధ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది వేలాది సంవత్సరాలుగా ఆయుర్వేదంలో ఉపయోగపడుతుంది. ఇది మెదడు పనితీరును ప్రోత్సహిస్తుంది. ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. బ్రాహ్మిని తినడం వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. ఇది మెమరీకి సంబంధించిన సమస్యలను అధిగమించడానికి సహాయపడుతుంది. పాలలో లేదా నీటితో బ్రాహ్మి పౌడర్ కలపి తాగవచ్చు.
2. ఆయుర్వేద వైద్యంలో శంఖ్పుష్పి విలువైన మూలిక. ఇది మనస్సును శాంతపరచడానికి, జ్ఞాపకశక్తిని పెంచడానికి ఉపయోగించబడుతుంది. ఇది ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి పనిచేస్తుంది. దీని కోసం మీరు గోరువెచ్చని నీటిలో టీస్పూన్ ఈ మూలికా పొడిని కలిపి తీసుకోవచ్చు.
3. అశ్వగంధ ఒక పురాతన, సంప్రదాయ ఔషధ మూలిక. కొన్నేళ్లుగా దీనిని ఔషధంగా ఉపయోగిస్తున్నారు. శారీరక రుగ్మతలను తొలగించడంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా సరిగ్గా ఉంచుతుంది. అశ్వగంధ మానసిక, శారీరక ఒత్తిడిని తగ్గించడానికి పనిచేస్తుంది. అశ్వగంధ మెదడులోని ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇది జ్ఞాపకశక్తి సామర్థ్యాన్ని పెంచడమే కాక మెదడు వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి పనిచేస్తుంది. మీరు పాలు, నీరు, తేనె నెయ్యితో కలపడం దీనిని తీసుకోవచ్చు.
4. తులసి మూలికలలో ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. తులసి ఆయుర్వేదంలో ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందింది. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది యాంటీబయాటిక్, యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ కార్సినోజెనిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది అనేక ఆరోగ్య సమస్యలను తొలగించడానికి పనిచేస్తుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను పెంచడానికి కూడా పనిచేస్తుంది. దీని కోసం మీరు 5 నుంచి 10 తులసి ఆకులు, 5 బాదం, 5 నల్ల మిరియాలు తేనెతో కలిపి తినవచ్చు. ఇది మెమరీ శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.
5. ధ్యానం – రెగ్యులర్ ధ్యానం మిమ్మల్ని మానసికంగా ఆరోగ్యంగా ఉంచుతుంది. మనస్సును శాంతింపజేస్తుంది. ధ్యానం ఒత్తిడిని తగ్గిస్తుంది. ఏకాగ్రతను పెంపొందించడానికి తోడ్పడుతుంది.