AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Drone Attack: భారత్‌పై తొలి డ్రోన్ దాడి.. వాయుసేన స్థావరాలను టార్గెట్ చేసిన ముష్కరులు

భారత్‌పై తొలి డ్రోన్ దాడి జరిగింది. ఉగ్రమూకలు డ్రోన్ల సహాయంతో జమ్ములోని వాయుసే ఎయిర్ పోర్టులోని హ్యాంగర్లపై దాడి చేసింది. అయితే వాయుసేకు సంబంధించిన ఆయుధాలకు, వారి వాహనాలకు ఎలాంటి ఎలాంటి నష్టం జరగలేదు.

Drone Attack: భారత్‌పై తొలి డ్రోన్ దాడి.. వాయుసేన స్థావరాలను టార్గెట్ చేసిన ముష్కరులు
Drone Attack
Sanjay Kasula
|

Updated on: Jun 27, 2021 | 4:30 PM

Share

భారత్‌పై తొలి డ్రోన్ దాడి జరిగింది. ఉగ్రమూకలు డ్రోన్ల సహాయంతో జమ్ములోని వాయుసే ఎయిర్ పోర్టులోని హ్యాంగర్లపై దాడి చేసింది. అయితే వాయుసేకు సంబంధించిన ఆయుధాలకు, వారి వాహనాలకు ఎలాంటి ఎలాంటి నష్టం జరగలేదు. ఇద్దరు సిబ్బందికి మాత్రం స్వల్ప గాయాలయ్యాయి. భారత్‌లో జరిగిన తొలి డ్రోన్ దాడి ఇదే కావడంతో రక్షణ విభాగం హై అలర్ట్ అయ్యింది. శనివారం అర్ధరాత్రి 1.30 సమయంలో గుర్తు తెలియని డ్రోన్లు తుక్కువ ఎత్తులో జమ్ము వాయుసేన స్థావరంలపై దాడి చేశాయి. స్థావరంలోని హ్యాంగర్ల పెద్ద పేలుడు పదార్థాలను జారవిడిచాయి. ఆ తర్వాత కొన్ని నిమిషాలకే మరో చోట ఇదే తరహాలో పేలుడుకు పాల్పడ్డాయి.

ఐదు నిమిషాల వ్యవధిలో రెండు పేలుళ్లు సంభవించాయి. అయితే పేలుడు జరిగిన ప్రదేశాలకు సమీపంలోనే ఎంఐ17 హెలికాప్టర్లను భద్రప్చే గోదాములు ఉండటంతో తొలత ఆందోళనకు గురయ్యారు. అయితే వాటికి ఎలాంటి ప్రమాదం జరగలేదని సమాచారం. ఈ ఘటన జరిగిన వెంటనే వాయుసే బృందాలు అక్కడికి చేరుకన్నాయి.

వాయుసేన విమానాలను ఉగ్రమూకలు టార్గెట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ దాడిని మాత్రం భారత రక్షణ వ్యవస్థ చాలా సీరియస్‌గా తీసుకుంటోంది. ఎందుకంటే ఇది భారత్‌లో డ్రోన్ల ద్వార జరిగిన తొలి దాడిగా వారు చెబుతున్నారు. ఈ పేలుళ్లలో ఒక భవనం పైకప్పు కొద్దిగా ధ్వంసం అయ్యింది. అయితే ఈ దాడి జరిగే ముందు మన రక్షణ వ్యవస్థలో ఉండే రాడారు గుర్తించక పోవడం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది.

జమ్ము క‌శ్మీర్‌ విమానాశ్రయంలో చోటుచేసుకున్న బాంబు పేలుళ్ల ఘ‌ట‌న‌పై ర‌క్ష‌ణ‌మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆరా తీశారు. వైస్‌ ఎయిర్‌ చీఫ్‌, ఎయిర్‌ మార్షల్‌ హెచ్‌ఎస్‌ అరోరాతో ఫోన్‌లో మాట్లాడారు. మరో ఉన్నతాధికారి ఎయిర్‌ మార్షల్‌ విక్రమ్ సింగ్‌ను సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించమ‌ని ఆదేశించారు.

పేలుళ్ల స‌మాచారం అంద‌గానే బాంబు స్క్వాడ్‌, ఫోరెన్సిక్‌ బృందాలు వెంటనే రంగంలోకి దిగి తనిఖీలు ప్రారంభించాయి. ఘ‌ట‌న‌కు బాధ్యులైన వారిని గుర్తించేందుకు ముమ్మ‌రంగా గాలింపు కొన‌సాగుతున్న‌ది. జమ్ము విమానాశ్రయం రన్‌వే, ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ వ్యవస్థ పూర్తిగా ఐఏఎఫ్‌ నియంత్రణలో ఉంటాయి. అందుకే ఈ ఐఏఎఫ్ అధికారులు ఈ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు జ‌ర‌పుతున్నారు.

ఇవి కూడా చదవండి: Maoist party: అడవిలో ఆందోళన.. హరిభూషణ్‌ స్థానంలో ఎవరొస్తారు.. ఇంటెలిజెన్స్ వర్గాల స్పెషల్ ఫోకస్..

Bitcoin: బిట్‌కాయిన్‌కు ఊరట…పెట్టుబడులు పెట్టేందుకు ఓకే చెప్పిన అక్కడి పార్లమెంట్