Bitcoin: బిట్‌కాయిన్‌కు ఊరట…పెట్టుబడులు పెట్టేందుకు ఓకే చెప్పిన అక్కడి పార్లమెంట్

కొన్ని రోజులనుంచి క్రిప్టోకరెన్సీ మార్కెట్ నేల చూపులు చూస్తోంది. అయితే.. క్రిప్టోకరెన్సీకి తాజాగా కొన్ని దేశాలు తీసుకున్న నిర్ణయం కొంత ఉపశమనం కలిగిస్తోంది.

Bitcoin: బిట్‌కాయిన్‌కు ఊరట...పెట్టుబడులు పెట్టేందుకు ఓకే చెప్పిన అక్కడి పార్లమెంట్
Follow us

|

Updated on: Jun 27, 2021 | 3:29 PM

క్రిప్టోకరెన్సీ.. డిజిటల్ కాయిన్.. ఈ పేరు వినిపిస్తేనే ప్రపంచం మొత్తం ఎంతో ఆస్తక్తి చూపించేది. అలాంటిది ఇప్పుడు ఎలన్ మస్క్, టెస్లా యూటర్న్‌ తీసుకోవడంతో ఒక్కాసారిగా భారీ ప్రభావం పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కోలుకోలేదు. మరోవైపు అతి పెద్ద మార్కెట్‌గా చెప్పుకునే డ్రాగన్ కంట్రీ చైనా కూడా క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులు పెట్టడంపై నిషేదం విధించింది. దీంతో గత కొన్ని రోజులనుంచి క్రిప్టోకరెన్సీ మార్కెట్ నేల చూపులు చూస్తోంది. అయితే.. క్రిప్టోకరెన్సీకి తాజాగా కొన్ని దేశాలు తీసుకున్న నిర్ణయం కొంత ఉపశమనం కలిగిస్తోంది.

ఎల్‌ సాల్వాడార్‌ బాటలో పరాగ్వే…

క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్‌కు ఎల్‌ సాల్వాడార్‌ దేశం చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం బిట్‌కాయిన్‌కు పరాగ్వే దేశం కూడా అదే రూట్‌లో వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. బికాయిన్‌కు చట్టబద్ధతను కల్పించాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు సంబంధించిన బిల్లును త్వరలోనే అక్కడి పార్లమెంట్ ఆమోదించినున్నట్లు తెలుస్తోంది. బిల్లుకు ఆమోదం లభిస్తే అధికారికంగా బిట్‌కాయిన్‌ను అంగీకరించే రెండో దేశంగా పరాగ్వే నిలవనుంది.

పరాగ్వే పార్లమెంట్‌ సభ్యుడు కార్లిటోస్ మాట్లాడుతూ.. ఈ బిల్లుతో దేశం మరింత వృద్ధిపథంలోకి నడుస్తోందనే ఆశాభావం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజుల నుంచి పతనమౌతున్న క్రిప్టోకరెన్సీకి ఈ నిర్ణయం కాస్తా ఉపశమనం కల్గుతుందని పేర్కొన్నారు. కాగా దక్షిణ అమెరికా దేశాలు బిట్‌కాయిన్‌ను స్వీకరించడానికి మరింత ఆసక్తిని చూపిస్తున్నాయి. దీంతో వారి దేశాలు ఇతర దేశాల కంటే ఎక్కువ ప్రయెజనాలతో పాటు, బలమైన ఆర్థిక శక్తిగల దేశాలుగా ఎదగడానికి ఉపయోగపడుతుందని కార్లిటోస్‌ పేర్కొన్నారు.

ఇరాన్‌లో నిరంతర బ్లాక్అవుట్ కారణంగా గత నెలలో బిట్ కాయిన్‌ను మూడు నెలలు పాటు నిషేధించింది. బిట్‌కాయిన్‌పై ఎలన్ మస్క్, టెస్లా యూటర్న్‌ తీసుకున్న విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి: Maoist party: అడవిలో ఆందోళన.. హరిభూషణ్‌ స్థానంలో ఎవరొస్తారు.. ఇంటెలిజెన్స్ వర్గాల స్పెషల్ ఫోకస్..