Ethiopian Tribe : ఇక్కడ లావుగా ఉండే వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ప్రతి అమ్మాయి కల..! అందుకోసం బరువు పెరిగే పోటీలు..

Ethiopian Tribe : ఇథియోపియన్‌కి చెందిన బోడి తెగ సంవత్సరానికి ఒక పోటీని నిర్వహిస్తుంది. ఇక్కడ గిరిజనులు ఆవు

Ethiopian Tribe : ఇక్కడ లావుగా ఉండే వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ప్రతి అమ్మాయి కల..! అందుకోసం బరువు పెరిగే పోటీలు..
Ethiopian Tribe
Follow us

|

Updated on: Jun 27, 2021 | 7:21 PM

Ethiopian Tribe : ఇథియోపియన్‌కి చెందిన బోడి తెగ సంవత్సరానికి ఒక పోటీని నిర్వహిస్తుంది. ఇక్కడ గిరిజనులు ఆవు రక్తం, పాలు తాగడానికి ఆరు నెలలు గడుపుతారు. గ్రామంలో అత్యంత బరువైనవారో ఎవరో తెలుస్తుంది. మీడియా నివేదికల ప్రకారం.. పోటీలో పాల్గొనే పురుషులు తమ గుడిసెలోనే ఉండి ఆరునెలల పాటు సంభోగం, ఇతర ఆనందాలకు దూరంగా ఉండాలి. ఆవు రక్తం, పాలను అద్భుతమైన కాక్టెయిల్‌లో కలుపుతారు. గ్రామంలోని స్త్రీలు పురుషులకు క్రమం తప్పకుండా వడ్డిస్తారు. తెగతో సమయం గడిపిన ఫ్రెంచ్ ఫోటోగ్రాఫర్ ఎరిక్ లాఫోర్గ్ డైలీ మెయిల్‌తో ఇలా అన్నాడు ‘లావుగా ఉండేందుకు రోజంతా పాలు, రక్తాన్ని తాగుతారు.’

సరిగ్గా ఆరు నెలలు లావు అయిన తర్వాత తమ గుడిసెల నుంచి బయటకు వచ్చి వారి అద్భుతమైన శరీరాన్ని ప్రదర్శిస్తారు. మిగిలిన గ్రామస్తులు దూరం నుంచి చూస్తారు. లాఫోర్గ్ మాట్లాడుతూ కొంతమంది పురుషులు చాలా విరామం తీసుకోవలసి ఉంటుంది. ఎందుకంటే వారు చాలా లావుగా ఉంటారు. నడవలేకుండా తయారవుతారు. ప్రజలచే ఓటు వేయబడిన అత్యంత లావైన వ్యక్తిని ‘హీరో’గా పట్టాభిషేకం చేస్తారు. ఆఫ్రికన్ ప్రకారం పోటీలో పాల్గొనే పురుషులందరూ అవివాహితులై ఉండాలి. గెలిచిన వారు వివాహం చేసుకునే అవకాశం ఉంటుంది.

నివేదిక ప్రకారం ఈ తెగకు చెందిన ఏ అమ్మాయి అయినా ‘లావుగా ఉన్న వ్యక్తిని’ వివాహం చేసుకునేందుకు ఇష్టపడతారు. వేడుక ముగిసిన తర్వాత పురుషులు వారి సాధారణ జీవితానికి వస్తారు. కొన్ని వారాల తర్వాత పెరిగిన లావు కూడా తగ్గిపోతుంది. ఒక నెల లేదా రెండు నెలల తరువాత మరొక రౌండ్ పోటీలు మొదలవుతాయి. బోడి తెగ ప్రజలు లావుగా ఉండటాన్ని చాలా అందంగా భావించడమే కాకుండా శరీరంలోని గుర్తులను ఆకర్షణీయంగా భావిస్తారు. మహిళలు తమ శరీరాలపై ఎక్కువ మార్కులు కలిగి ఉంటారని పురుషుడు వాటిని తాకడం మరింత ఆహ్లాదకరంగా ఉంటుందని వారు నమ్ముతారు.

Revanth Reddy: కేసీఆర్ అధికారానికి కారణమదే!.. చిట్‌చాట్‌లో కీలక వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి..

SBI Recruitment 2021: ఎస్‌బీఐలో ఫైర్ ఇంజనీర్ పోస్టులు.. ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ ముగుస్తోంది.. అప్లై చేసుకున్నారా?

ప్రధాని మోదీ సూచనతో వ్యాక్సిన్ తీసుకున్న మధ్యప్రదేశ్ వాసి.. ‘మన్ కీ బాత్’ లో ‘ప్రస్తావన’ !