Spain Ham : గిన్నిస్ బుక్ రికార్డ్‌లో పందిమాంసం..! ఒక ముక్క ధర ముచ్చటగా 3 లక్షలు..? ఎక్కడో తెలుసా..

Spain Ham : ఆహార ప్రియులు తమ కిష్టమైన ఆహారం కోసం ఎంతైనా చెల్లించడానికి సిద్ధంగా ఉంటారు. కానీ కొన్ని వంటకాల ధర

Spain Ham : గిన్నిస్ బుక్ రికార్డ్‌లో పందిమాంసం..! ఒక ముక్క ధర ముచ్చటగా 3 లక్షలు..? ఎక్కడో తెలుసా..
Spain Ham
Follow us
uppula Raju

|

Updated on: Jun 27, 2021 | 9:19 PM

Spain Ham : ఆహార ప్రియులు తమ కిష్టమైన ఆహారం కోసం ఎంతైనా చెల్లించడానికి సిద్ధంగా ఉంటారు. కానీ కొన్ని వంటకాల ధర సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండదు. అలాంటిదే ఈ స్పెయిన్‌లోని పంది మాంసం. చాలా దేశాలలో ప్రజలు పంది మాంసాన్ని ఇష్టపడతారు. అలాంటి ఒక దేశం స్పెయిన్. ఇక్కడి ప్రజలు ప్రతి సంవత్సరం లక్షా 60 వేల టన్నుల పంది మాంసం తింటారు. అంటే ఈ దేశ ప్రజలు పంది మాంసాన్ని ఎంత ఇష్టపడతారో ఊహించవచ్చు. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకమైన పంది మాంసం కూడా ఉంటుంది. ఆ పంది ఒక లెగ్ ధర లక్షల్లో ఉంటుంది. వాస్తవానికి ఈ పంది నుంచి హామ్ (HAM) తయారు చేస్తారు. దాని రుచి, తయారీ ప్రక్రియ కారణంగా ధర చాలా ఎక్కువగా ఉంటుంది.

హామ్ గిన్నిస్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది.. ఒక స్పానిష్ వ్యక్తి ఈ ప్రత్యేక జాతికి చెందిన పంది లెగ్‌ని 3 లక్షల 28 వేలకు అమ్మాడు. ఈ హామ్‌కు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం లభించింది. ఈ ఖరీదైన హామ్ తయారుచేసే ప్రత్యేక జాతి పందులను అండలూసియా ప్రాంతాలలో పెంచుతారు. ఇవి నల్ల జాతి పందులు వీటి హామ్ చాలా రుచికరంగా ఉంటుంది. స్పెయిన్లో ఈ హామ్‌ను జామోన్ ఇబెరికో డి బెల్లోటా అంటారు. హామ్ తయారు చేసిన పందులను పెంచడానికి ముందుగా వాటిని మూడు, నాలుగు సంవత్సరాలు బాగా తినిపిస్తారు. అనంతరం ఐదు నుంచి ఏడు సంవత్సరాల వరకు చీకటి గదిలో ఉంచుతారు. ఆ తరువాత వాటిని మార్కెట్‌కు తరలిస్తారు.

Boy Swallows Iron Nail : 7 అంగుళాల ఇనుప మేకును మింగిన 2 ఏళ్ల పిల్లవాడు..! శ్వాసనాళంలో చిక్కుకొని 21 గంటలు అవస్థలు..

Aadhaar Link : భూ రికార్డులతో ఆధార్ అనుసంధానం.. పారదర్శకత కోసం మరో రెండిటితో లింక్..! ఏంటో తెలుసుకోండి..?

Dual Airbags Rule : కారులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్ నిబంధనను పొడగించిన ప్రభుత్వం..! డిసెంబర్ 31 వరకు గడువు..