Viral video: పాముపాలిట శాపంగా మారిన ప్లాస్టిక్.. కూల్‌డ్రింక్ బాటిల్ మింగేసిన త్రాచుపాము..ఆ తర్వాత ఏమైందంటే
నెట్టింట మనకు నిత్యం చాలా వీడియోలు తారసపడుతుంటాయి. వాటిలో కొన్ని నవ్వుతెప్పితే మరి కొన్ని వెన్నులో వణుకు పుట్టిస్తాయి.
Viral video: నెట్టింట మనకు నిత్యం చాలా వీడియోలు తారసపడుతుంటాయి. వాటిలో కొన్ని నవ్వు తెప్పిస్తే.. మరి కొన్ని వెన్నులో వణుకు పుట్టిస్తాయి. ఇక జంతువవులకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు అయితే తెగ షేర్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మాములుగా పాములు గుడ్లని, చిన్న చిన్న ప్రాణులను మింగుతుంటాయి. కానీ ఇక్కడ ఓ పాము పెద్ద సాహసమే చేసింది. ఏకంగా ఓ కూల్ డ్రింక్ బాటిల్‌నే మింగేసింది. ఆతర్వాత దానిని జీవించుకో లేక నానా అవస్థలు పడింది. ఇక చేసేదేమి లేక ఆ బాటిల్‌ను వాంతి చేసుకుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నిజానికి ఈ వీడియో పాతదైనప్పటికీ ఇప్పుడు వైరల్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఉద్యోగి ఒకరు పోస్ట్ చేయగా ఇప్పుడు అది వైరల్ గా మారింది.
ప్లాస్టిక్ అనేది మానవజాతికేకాదు.. జంతువుల పాలిటకూడా శాపంగా మారింది అనడానికి ఈ వీడియోనే నిదర్శనం. ఈ సంఘటన గోవాలోని ఓ జరిగింది. ఆహారంకోసం వెతుకుతూ వచ్చిన ఓ పాము.. చివరకు ఏమీ దొరకక ఓ కూల్ డ్రింక్ బాటిల్‌ను ఆహరం అనుకోని మింగేసింది. ఆ తర్వాత చాలా అవస్థపడింది ఆ పాము. దాని బాధను చూడలేక స్థానికులు పాములు పట్టుకునే వ్యక్తికి సమాచారం అందించారు. దాంతో అతడు అక్కడికి చేరుకొని ఆ పామును కదిలిస్తూ ఉండటంతో చివరకు ఆ బాటిల్‌ను వాంతి చేసుకుంది. ఆ తర్వాత ఆ పామును అడవిలోకి వదిలేశారు.
When it comes to #plastic there is nothing called as throwing away. See how single use plastic like bottles effecting the wildlife & other species. Video may disturb you. pic.twitter.com/swnxAjbyCx
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) January 10, 2020
మరిన్ని ఇక్కడ చదవండి :