AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wonder Tree: అత్యద్భుతం: ఒకే చెట్టుకి 40 రకాల పండ్లు.. పెన్సిల్వేనియా ప్రతిసృష్టి

ఒక చెట్టుకు ఎన్నిరకాల పండ్లు పండుతాయి. ఒకే రకం కదా. కాని అక్కడ మాత్రం ఏకంగా 40 రకాలు కాస్తున్నాయి? మరి అదేలా సాధ్యం? అతను అనుసరించిన విధానమేంటి?

Wonder Tree: అత్యద్భుతం: ఒకే చెట్టుకి 40 రకాల పండ్లు.. పెన్సిల్వేనియా ప్రతిసృష్టి
Different Fruits
Venkata Narayana
|

Updated on: Oct 22, 2021 | 7:35 AM

Share

Fairytale Tree – Amazing tree grows 40 different kinds of fruit: ఒక చెట్టుకు ఎన్నిరకాల పండ్లు పండుతాయి. ఒకే రకం కదా. కాని అక్కడ మాత్రం ఏకంగా 40 రకాలు కాస్తున్నాయి? మరి అదేలా సాధ్యం? అతను అనుసరించిన విధానమేంటి? ఇదే ఇప్పుడు ప్రపంచం దృష్టిని విపరీతంగా అట్రాక్ట్ చేస్తోంది. మనం నిత్యం తినే పండ్లు సీజన్ల వారిగా లభిస్తుంటాయి. కోరుకున్న పండ్లు సీజన్‌ వెళ్లిపోయాక మళ్లీ కావాలంటే దొరకవు. పెన్సిల్వేనియా ఎక్స్‌పరిమెంట్ ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ఓ వ్యక్తి ఒకే చెట్టుకి 40 రకాల పండ్లు కాయించడం వండర్‌లా మారింది.

రీడింగ్‌ సిటీకి చెందిన సామ్ వాన్ అకెన్ ఈ రకమైన చెట్లను పెంచుతున్నాడు. జన్యుపరంగా ఒకేరకమైన మొక్కలను అంటుకట్టడం ద్వారా ఇది సాధ్యమైందట. విత్తనాలు ఉండే పండ్ల మొక్కలను జన్యుపరంగా అంటుకట్టడం ద్వారా ఈ చెట్టును సృష్టించాడు. ఇది ఒక రకమైన సైన్స్‌ ఎక్పరిమెంట్‌ అని అకెన్ చెప్తున్నాడు. ఈ చెట్టు కూడా మామూలు చెట్ల మాదిరే పెరుగుతుంది. వసంత ఋతువులో ఈ చెట్టు అందాలు చూడటానికి రెండు కళ్లు సరిపోవట. పింక్‌ కలర్‌లో చూపరులను ఆకట్టుకుంటుంది. తర్వాత నెలల్లోనే రేగు, పీచెస్‌, ఆప్రికాట్‌ పండ్లు, నేరేడు పండు, బాదం.. ఇలా 40 రకాల పండ్లు కేవలం మూడేళ్లకే కాయడం మొదలు పెడుతుందట ఈ చెట్టు.

ఈ ప్రక్రియనంతా ఎంతో ప్రేమతో చేస్తున్న అకెన్‌ దీనిని ఆర్ట్‌ వర్క్‌లా భావిస్తానని చెబుతున్నాడు. 40 రకాల పండ్ల చెట్టును సృష్టించడానికి వివిధ రకాల విత్తన పండ్ల మొక్కలను కనుగొనడానికి ప్రయత్నిస్తున్నప్పుడు.. ఆహార ఉత్పత్తిలో వైవిధ్యాన్ని గుర్తించానని వివరిస్తున్నాడు. వాణిజ్యపరంగా తక్కువ లాభదాయకమైన అనేక పండ్ల జాతులు కనుమరుగవుతున్నాయనే ఉద్దేశంతోనే ఈ ప్రయోగం చేశానని చెప్తున్నాడు. రైతులు, పండ్ల తోటలు పెంచే వారి నుంచి సేకరించిన మొక్కల ఆధారంగా 40 పండ్ల చెట్లను సృష్టించానంటున్నాడు. అమెరికాలోని అర్కన్‌సాస్, కెంటుకీ, మైనే, మసాచుసెట్స్, న్యూజెర్సీ, న్యూయార్క్, పెన్సిల్వేనియాలో అకెన్ చెట్లు కనిపిస్తుంటాయి. కోరిన పండ్లన్నీ ఒకే చెట్టుకి కాస్తే.. అనే ఇతని వినూత్న ఆలోచన నుంచే ఈ చెట్టు తయారైంది.

Fruit Tree

Fairytale Tree

Read also:  AP-TS నీటి పంచాయితీ.. మీ మార్గదర్శకాలు బచావత్ ట్రైబ్యునల్‌కు విరుద్ధమంటూ తెలంగాణ మరో లేఖాస్త్రం