AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nagarjuna University : మొదటి సెమిస్టర్ తెలుగు పేపర్ బదులు మూడో సెమిస్టర్ క్వశ్చన్ పేపర్.. దిక్కులు చూసిన విద్యార్థులు.!

నాగార్జున యూనివర్సిటీ అధికారుల నిర్వాకానికి విద్యార్థుల మైండ్ బ్లాక్ అయింది. పరీక్షా హాల్లో ఇచ్చి ప్రశ్నాపత్రం చూసి ఏంటిది..! అనుకుంటూ మనసులోనే చాలా సేపు మదనపడిపోయారు..

Nagarjuna University : మొదటి సెమిస్టర్ తెలుగు పేపర్ బదులు మూడో సెమిస్టర్ క్వశ్చన్ పేపర్.. దిక్కులు చూసిన విద్యార్థులు.!
Exams
Venkata Narayana
|

Updated on: Jul 24, 2021 | 12:22 PM

Share

Degree semester Exam : నాగార్జున యూనివర్సిటీ అధికారుల నిర్వాకానికి విద్యార్థుల మైండ్ బ్లాకైంది. పరీక్షా హాల్లో ఇచ్చిన ప్రశ్నాపత్రం చూసి ఏంటిది..! అనుకుంటూ మనసులోనే చాలా సేపు మదనపడిపోయారు. ఇచ్చిన క్వశ్చన్ పేపర్ ఏంచేసుకోవాలో కొంతసేపు అర్థంకాలేదు. అంతర్మధనం అనంతరం దిక్కులు చూడ్డం మొదలెట్టారు. కట్ చేస్తే, నెమ్మదిగా విషయం బోధపడింది. యూనివర్సిటీ డిగ్రీ మొదటి సెమిస్టర్ తెలుగు పేపర్ బదులు.. మూడో సెమిస్టర్ పేపర్ ఇచ్చారని అవగతమైంది. దీంతో పరీక్ష రాయకుండా ఖాళీగా కూర్చున్నారు విద్యార్థులు.

దీనిపై నాగార్జున యూనివర్శిటీ పరీక్షల కోఆర్డినేటర్ వెంకటేశ్వర్రెడ్డి సావధానంగా స్పందించారు. పేపర్ విడుదలలో పొరపాటు జరిగిన మాట వాస్తవమేనన్నారు. సాంకేతిక పరంగా జరిగిన పొరపాటు వల్ల మొదటి సెమిస్టర్ తెలుగు పరీక్షను రద్దు చేశామని తేల్చారు. ఆగస్టు 11వ తేదీన తిరిగి పరీక్ష నిర్వహిస్తామని వెంకటేశ్వరరెడ్డి వెల్లడించారు.

మూలాల్లోకి వెళితే, నాగార్జున యూనివర్సిటీ డిగ్రీ తెలుగు పేపర్‌ పరీక్షల్లో ఇవాళ గందరగోళం నెలకొంది. మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ తెలుగు పేపర్‌కు బదులుగా మూడో సెమిస్టర్ పేపర్‌ను ఇవ్వడంతో విద్యార్ధులు అయోమయానికి గురయ్యారు. అవుటాఫ్‌ సిలబస్‌తో క్వశ్చన్‌ పేపర్‌ వచ్చిందంటూ పరీక్ష రాయలేకపోయారు. ఇన్విజలేటర్లు వెంటనే ఈ విషయాన్ని యూనివర్సిటీ అధికారులకు తెలియచేశారు. అయితే, వచ్చినంత వరకు పేపర్‌ను అటెండ్ చేయాలని తెలిపిన యూనివర్సిటీ అధికారులు.. అనంతరం ఈరోజు పరీక్షను రద్దు చేసి ఆగస్టు 11వ తేదిని తిరిగి నిర్వహిస్తామని ప్రకటించారు.

ప్రకాశంజిల్లాలో మొత్తం 6 సెంటర్లలో 40 వేలమంది విద్యార్థులు నాగార్జున యూనివర్సిటీ నిర్వహిస్తోన్న డిగ్రీ ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలు రాస్తున్నారు. ఈరోజు జరుగుతున్న డిగ్రీ మొదటి సంవత్సరం తెలుగు పేపర్‌ పరీక్షలో చదువుకున్న సబ్జెక్టుకు, పరీక్ష పేపర్ లోని లోని ప్రశ్నలకు పొంతన లేకపోవడంతో విద్యార్ధులు అయోమయానికి గురయ్యారు.

తాము పరీక్ష రాయలేకపోయామని, జరిగిన పొరపాటును గుర్తించి యూనివర్శిటీ అధికారులు తిరిగి పరీక్షను నిర్వహించాలని విద్యార్ధులు, విద్యార్ధి సంఘాల నేతలు కోరారు. అలాగే గతంలో కూడా తప్పులు చేస్తూ విద్యార్ధుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్న యూనివర్శటీ అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

పేపర్ విడుదలలో పొరపాటు జరిగిన మాట వాస్తవమేనని గుర్తించిన అధికారులు, ఇది సాంకేతిక పరంగా జరిగిన పొరపాటుగా చెబుతున్నారు. మొదటి సెమిస్టర్ తెలుగు పరీక్షను రద్దు చేశామని, ఆగస్టు 11వ తేదీన తిరిగి పరీక్ష నిర్వహిస్తామని పరీక్షల కోఆర్డినేటర్ వెంకటేశ్వర రెడ్డి ప్రకటించారు.

దీంతో ఈ రోజు నిర్వహించిన డిగ్రీ ఫస్ట్‌ఇయర్‌ తెలుగు మొదటి సెమిస్టర్‌ పరీక్ష రద్దయినట్టేనని అధికారులు చెబుతున్నారు. ఒంగోలుతో పాటు గుంటూరు, ప్రకాశంజిల్లా పరిధిలో ఈరోజు పరీక్షలు రాసిన విద్యార్ధులకు న్యాయం చేస్తామని యూనివర్శిటీ అధికారులు ప్రకటించారని ఒంగోలు శర్మ కాలేజి ప్రిన్సిపల్‌ శ్రీనివాసరావు టీవీ9 కి తెలిపారు.

Exams Guntur

Exams Guntur

Read also :  Adilabad : నిర్మల్‌జిల్లాలో వరద బీభత్సం, పలు గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే.. బాధితుల ఆగ్రహావేశాలు