Adilabad : నిర్మల్‌జిల్లాలో వరద బీభత్సం, పలు గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే.. బాధితుల ఆగ్రహావేశాలు

నిర్మల్‌జిల్లాను ఇంకా వరదలు బీభత్సం వెంటాడుతునే ఉంది. పలు గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. గూడెంగాం గ్రామస్తులు..

Adilabad : నిర్మల్‌జిల్లాలో వరద బీభత్సం, పలు గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే.. బాధితుల ఆగ్రహావేశాలు
Adilabad Floods
Follow us
Venkata Narayana

|

Updated on: Jul 24, 2021 | 12:52 PM

Nirmal – Bhainsa – Floods : నిర్మల్‌జిల్లాను ఇంకా వరదలు బీభత్సం వెంటాడుతునే ఉంది. పలు గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. గూడెంగాం గ్రామస్తులు ఇంకా పునరావాస కేంద్రాల్లోనే తలదాచుకున్నారు. మూడు రోజులుగా ముంపులోనే గూడెం గ్రామం ఉండటంతో గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.

Adilabad Floods 5

Adilabad Floods 5

భైంసా ఎస్టీ హాస్టల్‌లో 110 కుటుంబాలకు పునరావాసం కల్పించారు. అధికారులు తమకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ ఇవాళ గ్రామస్తులు ఆందోళనకు దిగారు.  మరోవైపు నిర్మల్‌జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా ఇంకా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

Adilabad Floods 2

Adilabad Floods 2

మూడు రోజులుగా నీళ్లలోనే గుండెగాం గ్రామం మునిగి ఉంది. శాశ్వత పరిష్కారం చూపాలంటూ బైంసా డీఎస్పీ కార్యలయం దగ్గర ఆందోళనకు దిగారు గుండెగాం బాధితులు. ప్రస్తుతం బైంసా ఎస్సీ హాస్టల్‌లో 110 కుటుంబాలు తలదాచుకుంటున్నాయి. కట్టుబట్టలతో పునరావాస కేంద్రాలకు చేరిన గుండెగాం ముంపు బాధితులు తమకు భరోసా ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు.

Bhainsa Floods

Bhainsa Floods

తాజాగా లోకేశ్వరం మండలం అబ్దుల్లాపూర్ గ్రామంలో గుండ్ల వెంకన్న అనే వ్యక్తి ఇల్లు కూలిపోయింది.  అటు కొమురంభీమ్‌జిల్లా అందవెల్లిలో వరద ఉధృతికి పెద్దవాగు వంతెన కుంగిపోయింది. దాంతో వంతెనపై నుండి రాకపోకలను నిలిపివేశారు అధికారులు. మూడు మండలాలకు తాత్కాలికంగా రాకపోకలు నిలిచిపోయాయి.

Bhainsa Floods 2

Bhainsa Floods 2

భారీ వర్షాలకు గోదావరినది పరవళ్లు తొక్కుతోంది. మహారాష్ట్ర, కర్నాటకలో కురుస్తున్న వర్షాలకు గోదవరితోపాటు.. దాని ఉపనదులకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో బాసర టు ధవళేశ్వరం గోదారమ్మ పరవళ్లుతొక్కింది. ఎస్సారెస్పీ అన్ని గేట్లు ఎత్తి వరదనీటిని కిందకు వదులుతున్నారు.

Read also : Disha app : దిశ యాప్ : మహిళా రక్షణకు ఉక్కు కవచం, చెవిరెడ్డి పనితో సీఎం జగన్ ఫుల్ ఖుషి

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే