Disha app : దిశ యాప్ : మహిళా రక్షణకు ఉక్కు కవచం, చెవిరెడ్డి పనితో సీఎం జగన్ ఫుల్ ఖుషి

'దిశ యాప్'. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి మహిళకు ఒక భద్రత. వారికో రక్షణ. జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని రూపొందింపచేసిన..

Disha app : దిశ యాప్ : మహిళా రక్షణకు ఉక్కు కవచం, చెవిరెడ్డి పనితో సీఎం జగన్ ఫుల్ ఖుషి
Disha App 1
Follow us
Venkata Narayana

|

Updated on: Jul 24, 2021 | 10:29 AM

Disha app – Chevireddy – CM Jagan : ‘దిశ యాప్’. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి మహిళకు ఒక భద్రత. వారికో రక్షణ. జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని రూపొందింపచేసిన దిశ యాప్ ప్రతి మహిళ మొబైల్‌లో ఒక ఆయుధంలా ఉండాలని జగన్ సర్కారు సంకల్పించింది. ఆ సంకల్పం తన నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి చేరాలని, ఆ ఇంట్లో ఉన్న ప్రతి మహిళకు తోడుగా ఉండాలని భావించిన ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రాష్ట్రంలోనే చంద్రగిరిని ఆదర్శంగా నిలిపారు. ఏకంగా నియోజకవర్గంలోని 1.70 లక్షల మంది స్మార్ట్ ఫోన్‌లలో డౌన్లోడ్ చేయించి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రశంసలు అందుకున్నారు. చెవిరెడ్డి చేసిన ప్రయత్నమే రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో జరగాలని ఆదేశించిన ప్రభుత్వం.. చెవిరెడ్డిని అభినందించింది.

Disha App

Disha App

మహిళలపై జరుగుతున్న దాడులు.. అత్యాచారాలు, నేరాలను ఒక్క బటన్ నొక్కి ఉక్కుపాదం మోపేలా దిశా యాప్ ను డెవలప్ చేసింది ఏపీ ప్రభుత్వం. మహిళల భద్రతకు భరోసాను ఇచ్చింది. మహిళల మానప్రాణాలకు రక్షణే ప్రధాన కర్తవ్యంగా దిశా యాప్‌ను రూపొందించిన రాష్ట్ర ప్రభుత్వం సీఎం జగన్ సంకల్పంగా దిశ యాప్‌కు విస్తృత ప్రచారం కల్పించింది. ఇందులో భాగంగానే ఆపదలో ఉన్న ప్రతి మహిళ అత్యవసర సాయం కోసం దిశ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని భావించింది. ఎస్ వో ఎస్ బటన్ నొక్కితే చాలు ఆయా ప్రాంతాల్లోని పోలీసులు అందుబాటులోకి వచ్చేలా దిశ యాప్‌ను ప్రతి మహిళ స్మార్ట్ ఫోన్ లో అందుబాటులో ఉండేలా చేసింది.

ఆపదలో చిక్కుకున్న మహిళ దిశ యాప్ ఉపయోగించగానే, ఆమె ఉన్న లొకేషన్ తోపాటు చిరునామా దిశ కమాండ్ కంట్రోల్ రూమ్ కు సెకన్లలోనే సమాచారంగా చేరుతుంది. వాయిస్‌తో పాటు పది సెకన్ల వీడియో కూడా రికార్డ్ చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ కి తమ విపత్కర పరిస్థితిని చేరవేసే దిశ యాప్ ఇప్పుడు చంద్రగిరి నియోజకవర్గంలో ప్రతి మహిళ స్మార్ట్ ఫోన్‌లో అందుబాటులోకి వచ్చింది. ఒక యజ్ఞంలా దిశా యాప్ డౌన్లోడ్ కార్యక్రమాన్ని చేపట్టిన ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 1.70 లక్షల మందికి ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు.

Disha App 2

Disha App 2

గ్రామ సచివాలయ వాలంటీర్లు, సెక్రటరీలతోపాటు వీఆర్వోలు పంచాయతీ కార్యదర్శులకు బాధ్యతలను అప్పజెప్పి తానే స్వయంగా పర్యవేక్షించడంతో దిశ యాప్ డౌన్లోడ్స్‌లో సక్సెస్ అయ్యారు. మహిళా సంఘాల్లోని స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి మహిళ చేతిలో దిశ యాప్ ఒక ఆయుదంలా ఉండేలా పక్కా ప్లాన్‌తో దిశా యాప్ డౌన్లోడ్స్‌లో రాష్ట్రంలోనే చంద్రగిరి ఫస్ట్ ప్లేస్ లో ఉంచారు. ఇదంతా ఎమ్మెల్యే చెవిరెడ్డి సంకల్ప ఫలితమే అంటున్న మహిళలు దిశ యాప్ ను తీసుకొచ్చి సీఎం జగన్ రాష్ట్రంలోని ప్రతి మహిళ రక్షణ, భద్రత కు భరోసానిచ్చారని అంటున్నారు.

Disha App3

Disha App3

వైసిపి క్యాడర్‌ను, ప్రభుత్వ యంత్రాంగాన్ని సమన్వయం చేసి నియోజకవర్గంలోని ప్రతి మహిళకు దిశా యాప్ పై అవగాహన కల్పించేలా కరపత్రాలు అందచేసే కార్యక్రమాలు చేపట్టిన చెవిరెడ్డి సీఎంఓ నుంచి అభినందనలు పొందారు. చెవిరెడ్డి చేసిన ప్రయత్నమే రాష్ట్రమంతటా జరగాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు ఎస్పీ లకు సీఎంఓ కార్యాలయం ఆదేశించడం నియోజకవర్గ ప్రజలు ఇది తమకు గర్వంగా ఉందంటున్నారు.

ఇక చంద్రగిరి నియోజకవర్గంలో ప్రతి ఇంటి తలుపు తట్టి దిశ యాప్ పై అవగాహన కల్పిస్తున్న గ్రామ వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది.. స్మార్ట్ ఫోన్‌లో డౌన్లోడ్ చేసి,  దాని ఉపయోగాలు, ఆపద సమయంలో ఎలా ఉపయోగించుకోవాలో వివరిస్తున్నారు.

Read also ; Guru Purnima : తెలుగురాష్ట్రాల్లో భక్తిప్రపత్తులతో గురుపౌర్ణమి వేడుకలు.. ఆలయాల్లో భక్తుల రద్దీ