Telangana: ఉగాది పర్వదినాన ఆకాశంలో అద్భుతం.. నిప్పులు కక్కుతూ నేలరాలిన ఉల్కలు
ఉగాది పర్వదినాన ఆకాశంలో అద్భుతం చోటుచేసుకుంది. మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దులో ఈ అరుదైన సీన్ కనిపించింది. ఈ క్రేజీ విజువల్స్‌ను స్థానికులు మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేశారు.
ఉగాది పర్వదినాన ఆకాశంలో అద్భుతం చోటుచేసుకుంది. మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దులో ఈ అరుదైన సీన్ కనిపించింది. నింగి నుంచి పదుల సంఖ్యలో ఉల్కలు నేలరాలుతూ కనువిందు చేశాయి. గడ్చిరోలి, సిర్వంచ, వాంకిడి, కోటపల్లి ప్రాంతాలలో ఈ దృశ్యాలు కనిపించాయి. రష్యా.. ఉక్రెయిన్ మీద మిస్సైళ్లతో బాంబులు వేస్తున్నప్పుడు ఇలాంటి దృశ్యాలు కనిపించాయి. కానీ ఇవి ఆయుధాలు కాదు.. ఉల్కలు. నిప్పులు కక్కుతూ నేలరాలాయి ఈ ఉల్కలు. కొమరంబీమ్ ఆసిఫాబాద్ జిల్లా సరిహద్దుల్లోని గడ్చిరోలి, సిర్వంచ, వాంకిడి, కోటపల్లి వాసులు ఈ దృశ్యాన్ని కెమెరాలో బంధించి తెగ సంబరపడ్డారు. చీకటి పడిన సమయం నుంచి విడతలవారీగా ఈ ఉల్కాపాతం కనిపించింది. ఒక్కో ఉల్క రాలిపడుతుంటే సంబరపడుతూ కెమెరాలు చేతబట్టి.. ఆ విజువల్స్ రికార్డ్ చేస్తూ ఎంజాయ్ చేశారు స్థానికులు. ఒక దశలో పదుల సంఖ్యలో పెద్దఎత్తున నేలరాలాయి ఉల్కలు. 8గంటల 6 నిమిషాల సమయంలో పెద్దఎత్తున ఉల్కాపాతం కనువిందు చేసింది. అనూహ్యంగా కెమెరాకంటికి చిక్కింది భారీ ఉల్కాపాతం.
Also Read: AP: చదివింది ఐటిఐ.. కానీ బ్యాంకులనే దోచేయడానికి బయలుదేరాడు.. కట్ చేస్తే..