AP: చదివింది ఐటిఐ.. కానీ బ్యాంకులనే దోచేయడానికి బయలుదేరాడు.. కట్ చేస్తే..

కొంతమంది వినోదం కోసం యూట్యూబ్ చూస్తుంటారు... మరికొంత మంది విజ్ఞానం కోసం చూస్తుంటారు. ఇప్పుడు క్రిమినల్స్ యూట్యూబ్ బాట పట్టారు...‌ ఎందుకో తెలుసా..?

AP: చదివింది ఐటిఐ.. కానీ బ్యాంకులనే దోచేయడానికి బయలుదేరాడు.. కట్ చేస్తే..
Ap Crime News
Follow us

|

Updated on: Apr 02, 2022 | 8:09 PM

కొంతమంది వినోదం కోసం యూట్యూబ్ చూస్తుంటారు… మరికొంత మంది విజ్ఞానం కోసం చూస్తుంటారు. ఇప్పుడు క్రిమినల్స్ యూట్యూబ్ బాట పట్టారు…‌ ఎందుకో తెలుసా…. బ్యాంక్ దొంగతనాలు ఎలా చేయాలని…అవును అలా దొంగతనం చేసి.. రెండు సార్లు  పోలీసులకు దొరికిపోయాడో ప్రబుద్ధుడు. గుంటూరు నల్ల చెరువు సుగాలీ కాలనీలో ఉండే పల్లా రాజేష్ ఐటిఐ చదువుకున్నాడు‌. జులాయిగా తిరుగుతుంటాడు… ఈజీ మనీ కోసం అలవాటు పడ్డాడు. సులభంగా డబ్బులు సంపాదించడానికి బ్యాంకుల్లో చోరీ చేయాలనుకున్నాడు. అనుకున్నదే తడువుగా యూట్యూబ్ లోకి వెళ్ళాడు. బ్యాంక్స్‌లో ఎలా దొంగతనాలు ఎలా చేయాలో తెలుసుకున్నాడు. తెలుసుకున్న దానిని అమలు చేయాలనుకున్నాడు. 2021 ఆగష్టులో గుంటూరు(Guntur) నగరంలోని గాంధీ పార్క్ ఎదురుగా ఉన్న హెచ్‌డిఎఫ్‌సిని కార్యక్షేత్రంగా ఎన్నుకున్నాడు. తెల్లవారుజామున బ్యాంక్ లోకి చొరబడ్డాడు. ఇరవై మూడు లక్షల రూపాయలను సంచిలో సర్దుకొని బయటపడ్డాడు. ఈ చోరి అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రంగంలోకి దిగిన లాలా పేట పోలీసులు.. ఒక అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన సమాచారం, సిసి కెమెరా విజువల్స్ సాయంతో రాజేష్ పట్టుకున్నారు. ప్రస్తుతం బెయిల్ పై బయటున్నాడు.

మొదటి సారి ఫెయిల్ అయిన రాజేష్ రెండో టార్గెట్ ను ఎంచుకున్నాడు. ఈసారి ఫిరంగిపురంలోని ఎస్బిఐలో చోరికి ప్లాన్ చేశాడు. గత నెల 30వ తేదిన అనుకున్న ప్రకారం బ్యాంక్ లోకి ఎంటరయ్యాడు. కిటీకిని గ్యాస్ కట్టర్ ద్వారా తొలగించాడు. అలారం మోగకుండా వైర్లు కట్ చేశాడు. ఇక సేఫ్ లాకర్ ను ఓపెన్ చేసేందుకు సిద్ధమయ్యాడు. అయితే సేఫ్ లాకర్ కు బ్యాంక్ మేనేజర్ ఫోన్ అలారం పెట్టుకున్నాడు. దీంతో రాజేష్ సేఫ్ లాకర్ పై చేయి వేయగానే మేనేజర్ ఫోన్ లో అలారం మోగింది. వెంటనే మేనేజర్ సిబ్బందిని బ్యాంక్ వద్దకు పంపించాడు. బ్యాంక్ వద్ద హడావిడి పెరగడాన్ని గమనించిన రాజేష్ దొంగతనం చేయకుండానే అక్కడ నుండి జారుకున్నాడు.మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పాత కేసులను తవ్వి చేశారు. రాజేష్ ను అదుపులోకి తీసుకొని విచారించగా నేరం ఒప్పుకున్నాడు.

రిపోర్టర్: టి నాగరాజు, టివి9 తెలుగు, గుంటూరు

Also Read: AP: ఒకే గ్రామం.. 2 వర్గాలుగా విడిపోయి పిడకలతో సమరం.. ఎందుకంటే..?

Latest Articles